హన్సిక... నన్ను పెళ్లి చేసుకుంటావా?
on Jan 28, 2020
కథానాయికులకు ప్రేమ లేఖలు రాసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే... ఇది ఒకప్పటి మాట! మరి, ఇప్పుడు? నేరుగా కథానాయికలకు సోషల్ మీడియాలో లవ్ ప్రపోజల్స్ పెడుతున్నారు. కొందరు ఓ అడుగు ముందుకేసి పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నిన్నే పెళ్లి చేసుకుంటామని కథానాయికలకు చెబుతున్నారు. ఆపిల్ బ్యూటీ హన్సికకు ఇటువంటి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి.
సోమవారం రాత్రి ఇ హన్సిక ఓ సినిమా నైట్ షూటింగులో పాల్గొన్నారు. లొకేషన్ లో ఆమెకు కొంత గ్యాప్ దొరకడంతో ఇంస్టాగ్రామ్ లో ప్రేక్షకులకు ఒక అవకాశం ఇచ్చారు. 'నేను నెక్స్ట్ షాట్ కి రెడీ అయ్యే లోపు మీరు ప్రశ్నలు అడగండి' అని!
ఒక నెటిజన్ 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగారు. ''షాట్ రెడీ అయ్యింది. లేకపోతే నీ ప్రశ్నకు సమాధానం చెప్పే దాన్ని'' అని హన్సిక తెలివిగా తప్పించుకున్నారు. అంతకుముందే ఇంకొకరు 'నిన్ను పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాను. నేను వస్తాను. మోనా జీతో మాట్లాడతాను' అని అన్నాడు. ''నీకు చాలా ఆశలు ఉన్నాయి. వచ్చి మోనా జీతో మాట్లాడు. నిన్ను ఆవిడ గైడ్ చేస్తుంది'' అని హన్సిక సమాధానం ఇచ్చారు. ఎవరో హన్సికను వాట్సాప్ నంబర్ కూడా అడిగారు. దానికి వెటకారంగా ఒక నంబర్ చెప్పి... తన నంబర్ మర్చిపోయానని ఆమె అన్నారు.