నాన్నతో మాట్లాడలేక ధైర్యం కోసం మందుకొట్టిన హన్సిక
on Feb 13, 2017
నాన్నతోనో..బాస్తోనో మాట్లాడాలంటే ఏదో తెలియని భయం. వారిని చూడగానే వెన్నులో వణుకుపుట్టి నోటి వెంట మాట బయటకు రాదు. అప్పుడు మన సినిమాల్లో చూపించినట్లు మందు కొట్టి వారితో మాట్లాడితే ఎలా ఉంటుందా అని ఆలోచనలో పడతారు. అచ్చం ఇలాగే చేసిందట బొద్దు గుమ్మ హన్సిక. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే ఆమెకు నాన్న తెచ్చిన సంబంధం ఇష్టం లేదట..నాన్నతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాలని అనుకుందట..
కానీ అందుకు ధైర్యం చాలక స్నేహితురాలి ఇంట్లో మందు తాగి నాన్నతో ఈ విషయం చెప్పాలనుకుందట..అయితే పీకలదాకా మందు తాగి స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా పాపం మధ్యలోనే పోలీసులకు దొరికిపోయిందట హన్సిక..ఇదంతా రియల్ లైఫ్‌లో జరిగింది కాదు..రీల్ లైఫ్‌లో జరిగిన కథ. ప్రజంట్ తమిళంలో బోగన్ అనే చిత్రంలో నటిస్తోంది హన్సిక..అందులో ఓ డ్రింకింగ్ సీన్ కోసం ఇలా చేసిందట..అన్నట్లు ఆ సిన్ పండటం కోసం ఈ అమ్మడు నిజంగానే సెట్‌కి తాగేసి వెళ్లిందట.