తమన్నాకి అప్పుడే 40 కోట్లు
on Jun 24, 2014
తమన్నాకు బాలీవుడ్ అచ్చి రాలేదు, రెండో సినిమాతోనే మళ్లీ సౌత్ బండి ఎక్కేయాల్సిందే అని అనుకున్నారు హమ్‌షకల్ సినిమా విడుదలైన మొదటిరోజు. కానీ మూడు రోజులలో 40 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్సు తెచ్చుకుంది. సినిమా ఫ్లాప్ అని టాకు వస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. విడుదలైన 3 రోజుల్లోనే ఇంత కలెక్షన్ వచ్చిందంటే త్వరలేనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరుతుందని ఆశిస్తున్నారు. సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్‌లో వంద కోట్ల సినిమా బిజినెస్ మొదలు చేసిన మొదటి హీరోయిన్ అసిన్. ఆ తర్వాత ఇలియాన కూడా ఈ లిస్టులో చేరింది.
ఇప్పుడు తమన్నా నటించిన హమ్‌షకల్ కూడా వంద కోట్లు సంపాదిస్తే, బాలీవుడ్‌లో తమన్నా కూడా హిట్ హీరోయిన్ జాబితాలో చేరిపోతుంది.