హన్సికను టెన్షన్ పెట్టిన మీడియా
on Mar 12, 2015
టాలీవుడ్ మీడియా హన్సికను తెగ టెన్షన్ పెట్టేసిందట. రీసెంట్ గా హన్సిక ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినీ స్టార్స్- పాలిటిక్స్ గురించి తన ఒపెనియన్ చెప్పిందట. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకే రానవసరం లేదని అభిప్రాయపడిందట. దీంతో మీడియా వారు తమకు కావాల్సిన సమాచారం దొరికేసిందని, రాజకీయాల్లో వున్న సినీ ప్రముఖులందరిపై హనిక్స సెటైర్ వేసిందని హాట్ టాపిక్ గా అదరగొట్టారు. ఈ టాపిక్ విన్న హాన్సిక ఒక్కసారిగా ఊలిక్కిపడి౦దట. వెంటనే నేనెవర్నీ ఉద్దేశించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయలేదు. పవన్‌కళ్యాణ్ అంటే నాకు గౌరవం. పవన్‌ని నేను ఏదో అన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు..’ అంటూ వివరణ ఇచ్చింది హన్సికా మోత్వానీ. పవన్ నటన అన్నా, ఆయన వ్యక్తిత్వం అన్నా తనకు చాలా గౌరవం అనీ, ఆయనకున్న అశేషాభిమానుల్లో తానూ ఒకదాన్ననని హన్సిక చెప్పుకొచ్చింది.