పవన్ కళ్యాణ్ ను కాపీ కొట్టిన అల్లు అర్జున్
on Mar 12, 2015
'సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్, ప్రీ ఫస్ట్ లుక్ లతో ఆకట్టుకున్న త్రివిక్రమ్, టీజర్ లో ఏమి చుపించబోతున్నాడోనని మెగా ఫ్యాన్స్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే తీరా టీజర్ రిలీజయ్యాక చూస్తే త్రివిక్రమ్ ఇంకా అత్తారింటికి దారేది హ్యాంగోవర్‌లోనే ఉన్నాడని తెలుస్తోంది. అత్తారింటికి దారేది టీజర్ కాపీ పేస్ట్ చేసి 'సన్నాఫ్ సత్యమూర్తి' టీజర్ గా చూపించాడు. పవన్ కళ్యాణ్ లాగే , బన్నీ నడిచి వస్తూ కనిపించడం, బ్యాక్‌గ్రౌండ్‌లో దేవిశ్రీప్రసాద్ పాట రావడం, డ్రెస్సింగ్ స్టైల్ కూడా పవన్ ని పోలి వుండడం అందరిని షాక్ కి గురి చేసింది. అసలకే ఈ సినిమాపై ఇండస్ట్రీ లో భారీ అంచనాలున్నాయి. కానీ టీజర్ మాత్రం ఆ అంచనాలను ఆవిరి చేసింది. దీంతో సినిమాను కొన్నవారు సినిమా అయిన కొత్తగా వుంటుందో లేక అత్తారింటికి దారేదిని గుర్తు చేస్తుందో? అని టెన్షన్ పడుతున్నారట.