పవన్ కృష్ణావతారం రేపటి నుంచేనా !
on Jun 24, 2014
టాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఆసక్తికర విషయం గోపాల గోపాల చిత్రంలో పవన్ గెటప్. హిందీ ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో పవన్ కృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు. హిందీలో ఈ పాత్రలో అక్షయ్ కుమార్ మోడర్న్ కృష్ణుడిగా కనిపించాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ తొలిసారి ఇలాంటి పాత్రలో కనిపించబోతుండటంతో ఈ పాత్రను గురించిన ఆత్రుత అంతటా నెలకొని వుంది.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌లో వెంకటేష్, పవన్ కళ్యాణ్ రేపటి నుంచి పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా రహస్యంగా వుంచుతోంది చిత్ర యూనిట్. రేపటి నుంచే పవన్ షూటింగ్‌లో పాల్గొనినప్పటికీ, గోపాలుడిగా పవన్‌ని చూడాలంటే ఇంకా చాలా సమయం పడుతుందనిపిస్తోంది.