ఏముంది పల్లెల్లో

ఏముంది పల్లెల్లో.... ప్రేమానురాగం ఉంది ఏముంది పల్లెల్లో....నాకు నువ్వు, నీకు నేను అనే భరోసా ఉంది ఏముంది పల్లెల్లో....చిన్నప్పటి ఆట పాటలు ఏముంది పల్లెల్లో....పెద్దా- చిన్నా మర్యాదలు ఏముంది పల్లెల్లో....అరమరికలు లేని జీవితం ఏముంది పల్లెల్లో.....అణిగిమణిగే మనస్తత్వం ఏముంది పల్లెల్లో..... మంచి -చెడు భేదం చెప్పే పెద్దలు ఏముంది పల్లెల్లో....మరువలేని బంధుత్వం ఏముంది పల్లెల్లో....మధుర ఙ్ఞాపకాలెన్నో ఏముంది పల్లెల్లో.... పచ్చని పొలాలు ఏముంది పల్లెల్లో....పైర గాలులు ఏముంది పల్లెల్లో....చందమామ కథలు ఏముంది పల్లెల్లో.... సంతలో  బెరసారాలు ఏముంది పల్లెల్లో....జాతరలు ఏముంది పల్లెల్లో.... మమతానురాగాలు ఏముంది పల్లెల్లో.... కాబోయే వధూవరుల తీపి జ్ఞాపకాలు ఏముంది పల్లెల్లో.... కొత్త అల్లులకు మర్యాదలు ఏముంది పల్లెల్లో.... సరికొత్త అనుబంధాలకు ఆహ్వానాలు.... ఏముంది పల్లెల్లో.... మదిలో పెనవేసుకు పోయే కథలు ఏముంది పల్లెల్లో.... విడిపించుకోలేని సత్సంబంధాలు పల్లెల్లో అన్నీ ఉన్నాయి... పల్లెల్లో మనుషులకు మానవత్వం ఎక్కువ... పల్లెల్లో అనురాగం ఎక్కువ.... పల్లెల్లో జనం సరైన సదుపాయాలు లేక పట్నం వైపు పయనమైపోతున్నారు.... పల్లెల్లో తమ  వాళ్ళను వదిలి...తమది కాని ఊరిలో పరాయి వాళ్ళుగా బ్రతుకు ఈడుస్తున్నారు.... పల్లెలు....బోసిపోతున్నాయి పల్లెలు....మారిపోతున్నాయి పల్లెలు...మారితే... మనకు పూర్వ వైభవం ఎలా వస్తుంది... మళ్ళీ పల్లెలు .... పచ్చని పైరుతో కళకకళకళలాడుతూ... ధాన్యం ప్రతి ఇంటా రాసులుగా పోసి పండుగలు చేయాలి.... ..బంధువులంతా ఇంటి నిండా చేరి పెద్దల ఆశీర్వాదాలతో నిండు నూరేళ్ళూ హాయిగా బ్రతకాలి..... పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు మన పల్లెలను కాపాడుకుందాం

ప్రకృతి ప్రతిరూపమేగురవేసే విజయకేతనం

ప్రకృతి ప్రతిరూపమేగురవేసే విజయకేతనం     మలయమారుత వీచికయై   హాయి గొలుపుతూ సాగడమే కాదు, సుడిగాలి సందడయి, ఉక్కిరిబిక్కిరి చెయ్యటమూ,       మధుర సువాసనల గులాబియై       సొగసులు వెదజల్లటమే కాదు,       మొగ్గమాటున ముల్లై, కసుక్కున గుచ్చటమూ   గగనవీధిన మందగమన మేఘమాలలా తెలియాడడమే కాదు, ఫెళఫెళ మెరుపుల, గర్జనలు ఝుళిపించడమూ      నునులేత సిగ్గుల సుకుమారవదన,      వయ్యారములొలుకు స్త్రీగా మాత్రమే కాదు,      అపరచండీ చాముండియై,  శక్తియుక్తులనుపయోగించడమూ ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు పంచె సఖి, అర్దాంగి, మాతృమూర్తియే కాదు, సభ, సంఘ, దేశరక్షణ ల్లో పాత్ర వహించడమూ “ప్రకృతి ఫ్రతిరూప”మై నేర్చితినేన్నెన్నెన్ని గనుకనే,      కుటుంబవ్యవస్థలో కీళిక నాడినై      రాజకీయ రంగంలో మంత్రినై      విద్యాబోధనలో గురువునై      శస్త్రచికిత్సలో వైద్యురాలనై      యుద్ధవిమాన రథసారథినై        సైన్యవిన్యాసంలో సిద్దహస్తనై…      అదియిదియని లేక అన్ని రంగముల “మహిళా విజయ” పతాకమేగురవేస్తున్నా   -  కవిత బేతి  

భారతీయత

  అవును నేను భారతీయు...ని !! బ్రతుకు తెరువులో ఉన్న ఆడంబరాలకై దేశం దాటాను !! అయనా భారతీయత మరిచిపోలేక నా దేశం లో లోపాలన్నీ కనిపిస్తున్నాయి !! సుచి శుభ్రం తెలియని దేశం !! కానీ అందులో ఉద్భవించిన పంకజాలు ఎన్నో , మబ్బులు కమ్మిన నా కళ్ళకు కానరాలేదు !! ఆడవారి స్వేచ్ఛను హరించి వంటఇంటి కుందేలులుగా మార్చిన దేశం అనుకుంటున్న నేను మాత్రం విహంగమై విహరిస్తున్న భారతీయు...ని !! భారత పౌరసత్వం వదులుకున్నను ఒకప్పటి భారతీయు...ని మరి !! అబ్బో అక్కడ..... లంచం దానికి వేస్తుంది పెద్ద మంచం !! జనులంతా వెర్రి గొర్రెలు నా దృష్టిలో,అయ్యయ్యో మరిచాగా ఆ మందలో నేను ఒక గొర్రెనే అనే సంగతి !! ఓటు హక్కు లేదు అక్కడ కానీ బ్రష్టు పట్టిన కుల రాజకీయం అనే దౌర్భాగ్యం నా సొంతం !! ఆభివృద్ధికి ఉపన్యాసాలే ఇవ్వగలిగిన కొంతమందిలో నేను ప్రథమం...!! - కవిత రాయల

మహిళా మొగ్గలు

మహిళలు సకలరంగాల్లో పాదులు వేస్తేనే దేశం ప్రగతిపథంలో జండా ఎగురవేస్తుంది మహిళల ప్రతిభాపాటవాలు ఇలలో అనన్యం ఆత్మవిశ్వాసంతో అలుపెరుగని సహనంతో సమస్యలన్నింటిని చక్కదిద్దే  అసమానురాలు మహిలో మహిమాన్విత శక్తిస్వరూపిణి మహిళ సమాజ గమనంలో స్త్రీకి గౌరవ స్థానమందిస్తేనే సామాజిక మనుగడ సుసాధ్యం అవుతుంది మహిళాభ్యుదయం మహికే వెలుగు కన్నవారి కలలరూపమై మెట్టినింటి దీపమై మమకారం పంచే మమతల కోవెల అవుతుంది అనురాగజల్లులతో ఆశలు చిగురింపచేసేది మహిళ విధినిర్వహణలో విశేషప్రతిభను చాటుతూ కీలకరంగాలలో గుర్తింపు పొందుతున్నారు ప్రతిష్టాత్మక అవార్డుల విజేతలు మహిళలు అతివలు దృఢసంకల్పమనే ఆత్మవిశ్వాసంతో ఎన్నెన్నో అవరోధాలను అధిగమిస్తున్నారు లక్ష్యసాధనలో విజయకేతనం ఎగరవేసేది మహిళలు మమతానురాగాల మల్లెలసుగంధమై ఆత్మీయబంధాల సౌరభాలను గుభాళింపజేస్తుంది మహిళ ఉన్నచోట అవనిలో అంతా వెలుగు సమస్యలను దరిచేరనివ్వని మనోధైర్యంతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తుంది మొక్కవోని ఆత్మస్థైర్యానికి నిదర్శనం మహిళ సామాజిక శరపరంపరలు వేధించినా  తట్టుకుంటూనే శరవేగంతో ప్రగతిని సాధిస్తున్నారు మహిళా సాధికారతయే దేశానికి ప్రగతి బాట అవలీలగా అవకాశాలను అందిపుచ్చుకుని అంకితభావంతో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది శాస్త్రసాంకేతికరంగాల్లో మహిళ ప్రతిభ అసామాన్యం మాటలతూటాలు మనసును ముక్కలు చేస్తున్నా గుండెనిబ్బరంతో ధరణికి ప్రతిరూపమవుతుంది తరగని త్యాగానికి నిలువెత్తు రూపం తరుణి ఆవరించిన కటికచీకటిని చీల్చుకుంటూ మగువ తెగువతో అన్యాయాలను ఎదిరిస్తుంది సామాజికసంకెళ్ళను చేధించే చైతన్యరూపిణి మహిళ                 ✍ పులి జమున  

నక్షత్ర తోట

  ప్రతాప్ కౌటిళ్యా అతి మృదువుగా తాకిన పూల రెమ్మల స్పర్శలో చెట్టు మట్టిలోకి పాకి  ముని వేళ్ళల  వేళ్ళను ముద్దాడీ ఒక్కో మట్టి రేణువు అణు వు అణువున పులకరించి నా  సంకేతంతో  తనువు తనపై ఎగిరేసిన పచ్చటి జెండాను వదిలేసి చల్లని గాలి వలువలు ఊడదీసి నట్లు విడివిడిగా విడిపోయి ఆకాశమార్గ  ద్వారాన్ని మూసి వేసి మత్తుగా అక్షయపాత్ర లోని మధువును తాగేసిన పుప్పొడి రేణువులు వేలవేల వేణువై  గానం చేస్తున్నట్లు చెట్టు మొత్తంగా తలకట్టు ను నడుము చుట్టూ చుట్టుకున్న లేత చిగురుల పొగరు ఒకవైపు చిరునవ్వుల కొమ్మల సందుల్లో దూరిన నిన్నటి పుష్పం ఒకటి  ఒకటే కొంటే చూపుతో సిరిసిరిమువ్వల శబ్దంతో చెట్టంతటీ మగసిరినీ ఊపిరి పీల్చకుండా చేసి రాత్రి తో తలస్నానం చేసి వెన్నెల్లో  కురులు ఆరబోసుకున్న సుకుమారులు ఆ విరులు సువాసనల సుమాలు వనంలో ఓనమాలు దిద్దిన ట్లు ముద్దులతో  నుదుటీ పలకపై  అక్షరాభ్యాసం చేసి అర్థనగ్న ముగ్ద విరహ అద్దం లో  మెలికలు  తిరిగిపోతుంటే  ఒకానొక  నీటి చుక్క ఆత్మబంధువు ల  నీటి బిందువై నుదుట మెరిసి విరిసిన పూల ఇంద్రధనుసు లా వినిపించని కలవరింతలు కనిపించని కలలూ కొలనులోని  కన్యా  కలువలు పలుకరింతలతో  సుతిమెత్తగా ఒళ్లంతా ఆక్రమించిన చన్నీటి స్నానం భ్రమ రాలు ప్రియురాలి కై తపించిన ఏకైక కేకలు వినిపించెనే లేదేమో ఒళ్లంతా త్రుళ్ళీపడి ఒదిగి కరిగిపోయిన ఆ కన్య వనంలో పైనుంచి ప్రేమించీఎన్నెన్నో లోకాల్ని ఈదీ దాటీ  వాటిపై కురిసిన వాన చినుకులు ఇప్పుడు సంపూర్ణంగా కలిసి చెట్టును మట్టిలోకి మట్టిలోంచి చెట్టు ను బయటకు పుట్టించి  మట్టిలో చెట్టు ల కలిసిపోయిన  ఆ రతీదేవి నీ నేనేనంటూ పిలిచిన  లేత మొగ్గల  మొదళ్లలో మెరిసిన ఆ సున్నిత నీటి బిందువులు రేపటి తోటలో రాలిపోయే  పూల ఇంద్రధనస్సులు? వేల సూర్యుళ్లు పూసిన తోటలో వేల చందమామలు పూల భామల కోసం ఆకాశం నుంచి  దిగి వస్తున్నాయి ఆ సమాచారం అప్పుడే తారలకు చేరింది ఏమో భూలోకమంతా  నక్షత్ర తోట అయింది?!!!? - Pratap Koutilya  

ఫీజుల మాయజాలం

ఫీజుల మాయజాలం   కరోనా కాలమింక అయిపోలేదు మళ్ళీ విజృంభించడం మొదలు కార్పోరేట్ చదువులు కరోనాను లెక్కచేయక రాజకీయ రాబందులు ఫీజుల వసూలుకై  పసిపిల్లల ప్రాణాలు సైతం గాలికొదిలేసి కార్పొరేట్ రాగమందుకుంది కరోనాకంటే కాటేసే  కాలనాగులు  నాయకులు నయవంచకులు అంత మరోసారి లాక్డౌన్ వైపు అడుగులేస్తుంటే భవిష్యత్తు వారసుల జీవితాలతో చెలగాటం చేతివాటంతో జీవితాలన్నీ గాలిలో దీపాలైతున్నవి అడుగులన్నీ తిరోగమనం అంతా పైసా వసూల్ ప్రైవేటు పాఠశాలలు పడగలిప్పాయ్  వ్యాపారం జోరు బతుకు బేజారు పరిస్థితి ఏదైనా జలగల్లా ఫీజుకు రుచిమరిగి పీల్చేస్తరు పైసా ఏమోగానీ పానం ముఖ్యంగదా   సి. శేఖర్(సియస్సార్)

కవి మనసు.. కలం పలుకు..

కవి మనసు..కలం పలుకు..     చిల్లుల చొక్కా.. వేస్తే చుక్కా.. చేతిలో చుట్టా.. కాలిస్తే ఎందంటా.. కాశీలో గంట.. వాడు మనవాడే..? వీడు మనవాడే..? అందరూ మనవాళ్ళే..? మరి ఓడించింది ఎవరు..? ఓటరు మహాశయా..? మందు సుక్కనా..? మటన్ ముక్కనా..? నోట్ల కట్టానా..? మరి నోటా నా.. ? కేకలు వేస్తే కాదోయ్.. కాకలు తీరితే కమ్యూనిస్టు.. బంధీ అయితే కాదోయ్.. బతుకు నేర్పుతేనే కమ్యూనిస్టు.. ఈ కాలపు కమ్యూనిస్టుల కంటే.. కుష్టు రోగులే నయ్యం..   అత్తకు అల్లుడు తొత్తయే.. వాడు సంసారమెరుగని పక్షాయే.. పిల్లేమో తల్లికి కాపలాయే.. లోపటింట్లో అత్తా అల్లుడి లొల్లాయే..                                                                                                                        రచయిత - రవిశంకర్

మేలు

మేలు   వ్యాపకాల దారుల్లో వ్యాకులతలు ఎదురౌతున్నప్పుడు జ్ఞాపకాల గృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవటమే మేలు. అనుభూతుల సుమగంధాలను ఆస్వాదించేవేళ అపఖ్యాతుల దుర్గంధవాయువులు వీచుతున్నప్పుడు అనునయపు ఆలోచనల అగరువత్తులను వెలిగించుకోవటమే మేలు. అనుబంధాల భవనాలకు అపార్ధాలబీటలు వారుతున్నప్పుడు భవబంధాల తలుపులు తెరుచుకొని బయటపడటమే మేలు. ఆనందపు సాగరంలో హాయిగా ఓలలాడేవేళ ఆత్మీయులనుకున్నవారి అసూయ కెరటాలై పైపైకొస్తున్నప్పుడు కొంతకాలంపాటు మౌనతీరాన్ని చేరి మూగగా నిలవటమే మేలు. వినోదాల వేకువని విషాదాల చీకట్లు క్రమ్ముకొన్నపుడు విరక్తిని పారద్రోలే వివేకాన్ని నమ్ముకోవటమే మేలు.   కనులుమూసే వేళ కలలను కలతలు వేదిస్తున్నప్పుడు ఆ కలలతోనే చెలిమి చేసి వాటి గమనాన్ని మనకనుగుణంగా మార్చుకోవటమే మేలు. - భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

అన్నదాత కన్నీటి గాథ!

అన్నదాత కన్నీటి గాథ!       దేశ రాజధాని వీధులు..  రైతుల కన్నీటితో నిండుతున్నాయి. ఆవేదనలు ఎల్లలు దాటాయి.. కానీ.. ఢీల్లీ పార్లమెంట్ గెట్ దాటలేకపోయాయాయి.. బహుశా రైతుల కన్నీళ్లు.. సంద్రపు నీళ్లు అనుకున్నారేమో.. దేశపు నేతలు వారి ఆవేదనలు అసభ్యం అనుకున్నారేమో.. సత్యవంతులమనే నాయకులకు.. రైతులవి వాదాలు అనుకున్నారేమో... అయినా ఆశతో మొండిగా పార్లమెంట్  వైపు చూస్తున్నాయి.. అవి వాదాలు కాదు, నినాదాలు,   రైతుల విధానాలు కాదు..   భారత దేశ భవితకు పునాది దారాలు.. ఆర్తనాదాలు ఆవేదన గానాలు.. దేశ గతికి కృతి కి ఆరని ఆవేశపు పాఠాలు.. హక్కుల కోసం పొట్టపట్టుకుని పోరుచేస్తూ.. ప్రభుత్వాల తప్పులను ధిక్కరిస్తూ ఎత్తిన బాణాలు.. ప్రబోధపు గేయాలు..ప్రశ్నించే గళాలు..   హక్కులకై కదిలిన రైతుల కుత్తికెలు నొక్కుతూ.. ఒక వైపు సర్కార్ మొసలి కన్నీళ్లు కారుస్తూ.. చౌరీ చౌరాలో రక్తం చిందించిందే రైతులే అంటూ..   రైతుల త్యాగాలను ఆకాశాన్నికి పొగుడుతూ..   ఢిల్లీ లో మాత్రం పాతాళానికి తొక్కుతుంది.. తన ఉక్కు నరాలతో.. హలాలు దున్ని..   పొలాలు పండించి..   దేశపు పొట్టనింపిన అన్నదాతలను..   ప్రభుత్వం, ప్రయివేట్ విధానాలతో..   ఎండిన అన్నదాతల గొంతు కొస్తుంది..   బహుశా రైతు ఏడుపు.. ఎర్రకోటకు వినిపించలేదేమో..   దేశభక్తి అనే నేతలు భక్తిలోమునిగారు.. మరి.. ?   బహుశా రైతులదీ దేశ భుక్తి అనుకున్నారేమో.. ఓటమి ఎప్పుడు ఓటమి కాదు.. ? ఒంటరి అంతకన్నా కాదు .. ఒక్కొకటి గా చేరి కూటమై కూల్చండీ.. ఢిల్లీ గోడలను. అందుకు శాంతి , పోరాటం మార్గం కాదు.. అందుకు ఓటు ఒక్కటే నీ ఆయుధం.. ఓటు మాత్రమే నీ ఆయుధం..                                                                                                 - రచన : రవిశంకర్