నేనే నీవయ్యా!

నేనే నీవయ్యా!

 

 

నమ్మగలవా..
అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని!
ఒక్కసారలా నీ జ్ఞాపకాన్ని నిమిరినంత
వేవేల దీపకాంతుల నీ మేని ఛాయ,
నన్నో వినూత్న లోకంలోకి వయ్యారంగా
ఆహ్వానిస్తుంటే..


ఎద సందడిప్పుడు వర్ణించనలవి కాకుండా
క్రొంగొత్త ఆశల తీరంలో సేదతీరుతున్నట్లుంది!
నిజమే కొన్ని క్షణాల క్రితం వరకూ నాలో నేనున్నా!
ఇప్పటి నుంచే నే నీకయ్యా!
నేనే నీవయ్యా!
నీలోనేనయ్యా!
నీ నీలి కన్నుల్లో నీలాల జాబిలినయ్యా!!!

 

-Raghu Alla