వెన్నెలలా పలకరించావు
posted on Mar 3, 2021
posted on Mar 3, 2021
వెన్నెలలా పలకరించావు
వెలుగు ఎరుగని నిశీధి నేను
వెన్నెలలా పలకరించావు నీవు
నవ్వించావు.. ఏడిపించావు
ప్రేమని పంచావు.. దూరాన్ని పెంచావు
ఒంటరిని చేసి వెళ్ళిపోయావు
మళ్ళీ నా జీవితాన్ని అమావాస్య చేసావు
అయినా బాధలేదు
ఎదురుచూస్తాను
నీ కోసం కాదు
నా జీవితంలో వెలుగు కోసం
నా భవిష్యత్ కోసం.
- గంగసాని