నేస్తం

నేస్తం

 

ఎంతో మంచి నేస్తం
నాకు సొంతం అయ్యింది
రోజు తనతో గడపకపోతే
జ్ఞానం వికసించదు
అజ్ఞాన అంధకారం తొలగిపోదు
తనతో గడపనిరోజు మదినిండ వెలతి
నాతో నడిచేది నను నడిపించే నేస్తం
తను అనేకనేక రూపాలలో దర్శనమిస్తుంది
పదిమందికెపుడు ఆదర్శంగా తనుంటుంది
తనెక్కడుంటే అక్కడ విజ్ఞానం వినోదం ఉల్లాసం ఉత్సాహం
అందరూ నన్ను మెచ్చుకుంటారు
నా కనులకు దీపం నా నేస్తం
ఎవరో తెలుసా నా నేస్తం
ఇంకెవరో కాదు "పుస్తకం"

 

ఎ. స్నేహా