అందమైన పల్లె
posted on Feb 16, 2021
అందమైన పల్లె
నా పల్లె స్వచ్ఛమైన మనుషులకు మమతలకు
పెట్టింది పేరు
అందమైన ప్రకృతికి మారుపేరు
సంస్కృతి సంప్రదాయాలకు చిరునామా
రైతన్నల కష్టంతో పచ్చదనంతో అలరారు
పల్లెపడుచులంతా పొలంలో నడుమొంచి పాటందుకుని కన్నబిడ్డల్లా అలంకరిస్తరు
మా ఊరు తీరును మార్చే
మా బడే మా చదువుల గుడి
తొలి అడుగులక్కడే
తొలి పలుకులక్కడే
తొలి గురువులక్కడే
జ్ఞానం పొందిన దేవాలయం
మా బతుకుకది రక్షణ కవచం
ఎ.ధరణి.