posted on Jan 28, 2021
సోయగాల భానుడు
లోకాన్నంతా మేల్కొలిపే భానుడు
తన అందానికి మెరుగులద్దుతున్నడు
జలది దర్పణంలో చూసుకుంటూ
సూర్యుడు బహు సొగసుకాడే
విశ్వమంతా చైతన్యం నింపడానికే..
ఆ రూపం కాంచగా
ఎదలో నిండును ఆనందం
ఆయనకో శుభోదయం
సి. శేఖర్(సియస్సార్)