ఆనందం..
posted on Feb 23, 2021
ఆనందం...
కలలు తెల్లారితే మాయమవుతాయి...
కష్టాలు ఆనందం వొస్తే మాయమవుతాయి...
కన్నీళ్లని దిగమింగుకొని బ్రతికే
అలుపెరుగని బాటసారులు ఎందరోవున్నా...
అనునిత్యం వినిపించేవారినే గుర్తిస్తారు
కనిపించేవారినే పూజిస్తారు...
ఇక్కడ మనిషికి కావాల్సింది
కలలో, కష్టాలో కాదు... ఆనందం.
ఒకరికి డబ్బుతో ఆనందం ఉంటుంది...
మరొకరికి స్నేహంతో ఆనందం ఉంటుంది.
ఇలా ఒక్కొక్కరికి ఒక్కోటి ఆనందం ఇస్తుంది.
దేన్ని కోరుకున్నా... కోరుకోకపోయినా
ఆనందాన్ని కోరుకోని వారుండరు.
Malleshailu