స్నేహగీతం
posted on Feb 4, 2021
posted on Feb 4, 2021
స్నేహగీతం
సహాయంలో సంతోషం
నిట్టూర్పులో ఓదార్పు
ఒంటరితనంలో తోడనీడ
అపాయంలో ధైర్యం
అవసరంలో భరోసా
ఇష్టంలో కష్టంలో బాగం
ఎక్కడైనా ఎచ్చటైనా
మా నినాదం నిస్వార్ధం
మనసంతా నిండుకునేది
జీవితమంతా కొనసాగేది
అపజయమైనా
విజయమైనా
వీడిపోనిది నా స్నేహం
ఎన్నటికీ ఆగిపోనిది
ఈ నా స్నేసగీతం
- యం.డి. షబానా