కుటుంబం


కుటుంబం

నా అనురాగాలకు చిరునామా
నా అనుబంధాలకు నిలయం
అమ్మనాన్నలు కొలువుండే దేవాలయం
అన్న చెల్లి అక్కా తమ్ముళ్ల అల్లరి కేకల అలజడులను ఓపికతో సహించే ఆటస్థలం
ఇంటినుండి మొదలైన అనుబంధాలు విశ్వజనీనమై వర్థిల్లజేసే శాశ్వత ఆనందానికి కేంద్రం నా కుటుంబం
నా ఆనందం, అనురాగం, అలకలు, ఆప్యాయతలన్నీ నాలో నింపి ధైర్యమై చివరివరకు అంటిపెట్టుకొని
తరిగిపోని అనుబంధాలకు
బలాన్నిచ్చేదే నా కుటుంబం

కె. గౌతమి