విద్య
posted on Feb 9, 2021
విద్య
విద్య విలువను చెప్పిన
అమ్మనాన్నల మాట
నా బతుకుకు వెలుగుబాట
అక్షరాలనన్ని ఒక్కొక్కటిగా ఒడిసిపట్టి మదిలో చేర్చినపుడు
నాలోని అజ్ఞానాంధకారం తొలగిపోయి వెలంగునిండిన ఆ క్షణం వెలిగెను
నాలో జ్ఞాన జ్యోతులు నింపింది
నాలో కొత్త ఆలోచనలకు బీజం వేసి సంస్కారాన్నద్దింది
నాలో నింపెను జీవనసారం
విచక్షణ నేర్పి బతుకుకు ఆదెరవని మనసునిండింది
విలువలు నేర్పిన విద్య
నా విలువను సైతం పెంచింది
వినయం నా సొంతంచేసి
అపురూపమైన విజయం అందించింది విద్య
బతుకును మార్చిన విద్య
భవితను తీర్చింది
- జి. అరుణ