వర్షం
posted on Mar 1, 2021
వర్షం
వర్షం కురుస్తుంటే పంటలన్నీ
పచ్చగా మొలకెత్తి
ప్రకృతినంతా పులకరింపజేస్తది
వర్షం రైతులందరికీ వరాలవానై సిరులు కురిపిస్తది
తరువులన్ని వర్షంతో నిండు ముత్తైదువలా ముస్తాబయ్ మురిపిస్తయ్
వర్షం వస్తే కుంటలు చెరువులు
నిండుకుండలై అలుగెలుతయ్
వర్షం మానవాళికి జీవనాధార
వర్షంలో తడుస్తూ
పిల్లకాలువల్లో కాగితపు పడవల పరుగులు తీస్తుంటే
మా అందరి ఆనందానికి ఆకాశమే హద్దు
అందుకే వర్షమంటే మాకు ముద్దు
వి. సుజాత