కృష్ణ జిల్లాలోలో జగన్ కు వేయి కోట్ల బినామీ ఆస్థులు ...?
Publish Date:Apr 8, 2012
Advertisement
వై.ఎ.ఆర్. కాంగ్రెస్ అధినేత, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి విజయవాడ నగరంలో భారీ ఎత్తున బినామీ ఆస్తులున్నట్టు తెలుస్తోంది. విజయవాడ నగరంలో అత్యంత ఖరీదైన రోడ్డుగా పేరుగాంచిన బందరు రోడ్డులోని బెంజిసర్కిల్ ప్రాంతంలో దాదాపు రూ.200 కోట్ల రూపాయల విలువచేసే ఎంతో విలువైన్ బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నగరం నడిబొడ్డులో వున్న ఈ స్థలంలో ఒక వాహన కంపెనీ వుండేది. ఆ కారణంగానే బెంజిసర్కిల్ అనే పేరు ఈ సెంటర్ కు వచ్చింది. ఈ స్థలం నుంచి లారీ కంపెనీ వేరే ప్రాంతానికి తరలించడంతో పాటు స్థలం యాజమాన్యం విషయంలో వివాదాలు తలెత్తాయి. వివాదాస్పదమైన ఈ స్థలాన్ని జగన్ ఒక సినిమా హీరోతో కలిసి బినామీ పేరుతొ చౌకగా (200కొల్తు) కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. దాదాపు అయిదు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలంలో ఎనిమిది మల్టీఫ్లెక్స్ థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థలం స్వాధీనం చేసుకోవడం, కాంప్లెక్స్ ల నిర్మాణవ్యవహారాలను ఆ సినిమా హీరో పర్యవేక్షిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద కాంప్లెక్స్ గా గుర్తింపు పొందుతుంద ని భావిస్తున్నారు. ఈ స్థలంతోపాటు బందరురోడ్డులోనే మరో రూ.100 కోట్ల విలువైన స్థలం కూడా జగన్ కొనుగోలు చేసినట్టు తెలిసింది. యాజమాన్య హక్కుల పరమైన వివాదాలు కలిగిన ఈ స్థలం వివాదాన్ని జగన్ పరిష్కరించిన తర్వాత తానే కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో ఒక రాజకీయపార్టీకి చెందిన వ్యక్తి (ఈయన తొలుత ప్రజారాజ్యంపార్టీలో చెరి తర్వాత, చిరంజీవిపై విపరీతమైన ఆరోపణలు చేసి బయటకు వచ్చి తెలుగుదేశంపార్టీలో చేరారు)కి చెందిన ఒక ప్రైవేటు బస్సుల కంపెనీ కార్యాలయం వుంది. విజయవాదతోపాటు కృష్ణాజిల్లాలో జగన్ కు వున్న ఆస్తుల విలువ వెయ్యికోట్లకు పైమాటేనని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/ysr-congress-president-24-13234.html





