హరీష్ రావు తీరును తప్పు పట్టిన స్పీకర్!

Publish Date:Sep 8, 2026

Advertisement

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు  మంగళవారం (సెప్టెంబర్ 8) వాడీవేడి వాదనలతో మొదలైంది. సభ మొదలైన క్షణం నుంచే  నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.  తొలి రోజు అసెంబ్లీ వెలుపల చోటుచేసుకున్న పరిణామాలు, ఆందోళనలు సభలో  మాటల మంటలకు దారి తీశాయి.

మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, సునీత చీర లాగడం మరియు సబితా ఇంద్రారెడ్డి మెడ పట్టుకోవడం వంటి ఘటనలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాతా మధు ఇప్పటికే తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినప్పటికీ, ఆయనను అరెస్ట్ చేయడం పట్ల హరీష్ రావు ఆగ్రహం  వ్యక్తం చేశారు.

 దీనిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ ఎమ్మెల్యేలంటే సభకు ఎంత గౌరవం ఉందో తనకూ అంతే గౌరవం అని చెప్పిన ఆయన ఈ ఘటనలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయిన వెంటనే నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

 సభలో హరీష్ రావు వ్యవహరిస్తున్న తీరును, ఆయన ఆవేశాన్ని స్పీకర్   తప్పుబట్టారు. సభలో  అనవసరమైన ఆవేశం ప్రదర్శిస్తున్నారంటూ హరీష్ రావును ఆయన నేరుగా తప్పుపట్టారు. నిజానికి తన కన్నతల్లిని దూషించినప్పుడు తనకు   ఆవేశం రావాలి కానీ, అసలు సంబంధం లేని విషయాలపై   ఎందుకంతగా ఆవేశపడుతున్నావంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ హరీష్ ను నిలదీశారు.

తన తల్లిని దూషించిన దానికి హరీష్ రావు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.  ఈ దశలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు. అదలా ఉంటే హరీష్ రావు సభలో స్పీకర్‌ను బెదిరించేలా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. 

[War Of Words  B etween ruling and opposition Mmembers,  Telangana Assembly,  Speaker Gaddam Prasad, Harish Rao, BRS, Congress, Sridhar Babu, Telangana Poliyics, Telugu One]

By
en-us Political News

  
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు   కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
 తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు.  తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని  ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది. 
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.