బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టు కోర్టు ధిక్కరణే.. కేటీఆర్ ఫైర్.!

Publish Date:Sep 7, 2026

Advertisement

 

ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ రెడ్డిల అరెస్టు కోర్టు ధిక్కరణ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గడ్డం మధుసూదన్ ను, ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు మంగళవారం (సెప్టెంబర్ 8) ఉదయం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను ఖండిస్తూ.. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు విస్పష్టంగా ఆదేశవించినా, ప్రభుత్వం ఖాతరు చేయలేదన్నారు. ఎమ్మెల్సీల అరెస్టు కచ్చితంగా కోర్టు ధిక్కరణేనన్నారు,  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కోర్టుల పట్ల, చట్టం పట్ల ఇసుమంతైనా గౌరవం లేదని విమర్శించారు. 

 1000 రోజుల పాలనలో రేవంత్ సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. వాగ్దానాల అమలులో విఫలం కావడమే కాకుండా, దానిని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేస్తోందని దుయ్యబట్టారు.

 ఇప్పుడైనా కాంగ్రెస్ సర్కార్ తన 420 హామీలను ఇప్పుడైనా అమలు చేస్తే,   బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం స్వచ్ఛందంగా అరెస్టౌతాం, అందుకు మీరు రెడీనా అంటూ సవాల్ విసిరారు.   
 బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల చీరలు పట్టుకుని, మెడపై చేయివేసి దాడి చేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల కనీస గౌరవం కూడా లేదా అని ప్రశ్నించారు.  

 [BRS MLCs arrest Contempt Of Court,  KTR, Congress government, Telangana Assembly, Revanth Reddy, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
 తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు.  తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని  ఆరోపించారు.
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది. 
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.