కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి యత్నం భగ్నం.!
Publish Date:Sep 8, 2026
Advertisement
తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసం ఉండే ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు శాసనసభ స్పీకర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఫాంహౌస్ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ వైపు వచ్చే ఏ ఒక్కరినీ అనుమతింబోమని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి ముట్టడికి యత్నిస్తేచర్యలు తప్పవనీ హెచ్చరించారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం144వ సెక్షన్ ను అములు చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోకి సాధారణ పౌరులు, ప్రయాణికులు రాకపోకలు సాగించకుండా పోలీసులు కట్టడి చేశారు. అత్యవసర పనుల మీద అటుగా వెళ్లే స్థానికులను సైతం ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదం.. ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల వాగ్వాదాలకు, ఘర్షణ వాతావరణానికి దారితీసింది.
144Section Near kcr farmhouse, erravalli farmhouse, section 144 implemented, Telangana politics, congress protest kcr, Telugu One
http://www.teluguone.com/news/content/---144section-near-kcr-farmhouse-24-230953.html





