విజయవాడ: విజయవాడ సమీపంలోని గన్నవరం ఐటిపార్క్ వ్యాపార లావాదేవీలు లేక వెల వెలబోతోంది. ఈ పార్కును ప్రారంభించి నాలుగేళ్ళు గడుస్తున్నా ఇప్పటిదాకా నాలుగు కంపెనీలు మాత్రమే తమ కార్యాలయాలు ప్రారంభించాయి. వేలాదిమందికి ఉపాధి కల్పించాల్సిన ఈ పార్కులో ప్రస్తుతం 200 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా 30 ఎకరాల విశాలమైన స్థలంలో 2006 మే 27న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఐటి పార్కుకు శంఖుస్థాపన చేశారు. దీనివల్ల ప్రత్యక్షంగా 10వేల మందికి, పరోక్షంగా 30వేల మందికి ఉపాధి కలుగుతుందని అప్పట్లో ఆయన ప్రకటించారు. ఇటీవల ఐటి పార్కును సందర్శించిన రాష్ట్ర ఐటిశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఈ ఐటి పార్కుకు ఎంతో భవిష్యత్తు ఉందని, హైదరాబాద్ కు ధీటుగా ఇది తయారవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సుమారు 80 కోట్లతో నిర్మించిన మొదటి దశ టవర్ లో ప్రస్తుతం నాలుగు కంపెనీలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నిజానికి ఇక్కడ 20 సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ఖాళీగా ఉంటున్న మిగిలిన భాగాల మెయింటినెన్స్ కూడా నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. మొదటిదశ టవర్ ఖాళీగా ఉండడంతో మిగిలిన టవర్ ల నిర్మాణం నిలిచిపోయింది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నా, కొత్తగా సంస్థలు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఐటి పరిశ్రమ తిరోగమనంలో ఉండటం, పరిశ్రమలన్నీ హైదరాబాద్ కే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ దుస్థితి దాపురించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayawada-24-12371.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.