హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమం అభాసుపాలవుతుంది. రచ్చబండ సందర్భంగా వచ్చిన లక్షలాది విన్నపాల్లో కొన్ని ఇప్పటికే చెదలపాలయ్యాయి. విన్నపాల్లో పదోవంతు సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెండుసార్లు రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా దాదాపు 50 లక్షల వినతి పత్రాలు వచ్చాయి. గత ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12 వరకు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమలో వచ్చిన వినతులన్నింటినీ కంప్యూటర్లలో ఫీడ్ చేశారు. రెండోసారి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో దాదాపు 25 లక్షల వినపత్రాలు అధికారులకు అందాయి. మొదటి వినతి పత్రాలను పరిష్కరించినా, పరిష్కరించకపోయినా కనీసం కంపూటర్లలో నమోదు చేశారు. రెండోసారి వినపత్రాలకు అ భాగ్యం కూడా దక్కలేదు. కట్టలు కట్టలుగా వాటిని రెవెన్యూ కార్యాలయాల్లో పడేశారు. వాటిల్లో కొన్ని వినపత్రాలు చెదలకు ఆహారంగా మారాయి. దీనిపై రెవెన్యూశాఖ కార్యదర్శులను వివరణ అడిగితే కంప్యూటర్లలో వీటిని త్వరలోనే నమోదు చేయిస్తామని తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా రెండవ విడత వినతి పత్రాల నమోదు కార్యక్రమం ఇంకా ప్రారంభించలేదని వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/state-government-24-12370.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.