Publish Date:May 15, 2012
చిరంజీవి మంగళవారం కేంద్రమంత్రి వాయలార్ రవితో భేటీ అయ్యారు. చెన్నైలోని తన వియ్యంకుడి ఇంట్లో ఐటి అధికారుల దాడులపై, రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలపై మంతనాలు జరిపారు. రవితో చిరంజీవి దాదాపు పది నిమిషాలు చర్చలు జరిపారు. బుధవారం వాయలార్ రవి రాష్ట్రానికి రానున్నారు. బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితలతో కలిసి ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రచార సమయంలోనే ఆయన ఆయా నియోజకవర్గ నేతలతో సమీక్షలు జరపనున్నారు. ఉప ఎన్నికలలో గెలుపు వ్యూహాలపై వారితో చర్చించనున్నారు. రవి ప్రచార షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 17న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో, 18న అనంతపురంలో, 19న గుంటూరులో వాయలార్ రవి ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vayalar-ravi-chiranjeevi-24-14055.html
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది.