Publish Date:Dec 29, 2012
కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం లోపించిందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు వి. హనుమంత రావు వ్యాఖ్యానించారు. నిన్న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ నుండి హాజరయిన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, శాసనసభ్యుడు గాదె వెంకట రెడ్డిలు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, ఇలా పంపడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ విషయంలో ప్రశ్నిస్తే, దానికి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడి బొత్స సత్యనారాయణలే సమాధానం చెప్పాలని విహెచ్ స్పష్టం చేశారు. ఇలా చేసి కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయాన్ని ప్రశ్నార్థకంగా మార్చారని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో తెలంగాణా, సీమంధ్రా ప్రాంతాలనుండి ఇతర సామాజిక వర్గాలకు చెందిన అనేక మంది అనుభవం కలిగిన నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. ఆలాంటి వారెవరూ ఈ ప్రతినిధుల ఎంపికలు చేసిన నాయకులకు కనిపించలేదా అని విహెచ్ ప్రశ్నించారు.
బహుశా, విహెచ్ లేవనెత్తిన ఈ కీలక అంశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కాస్తంత గందరగోళాన్నే కలిగించే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/v-hanumantha-rao-mp-43-20094.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా సంచలన విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.
రాప్తాడు బాలిక లక్ష్మి సాహసానికి గుర్తింపు.. చదువుకు అండగా ఆనంద్ మహీంద్రా.!
ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు.
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా 3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు పేర్కొంది. ఇందు కోసం దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నవంబర్ 13, రెండో విడత నోటిఫికేషన్ ను నవంబర్ 18న, ఒక మూడో విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 19వ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది.
4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి సమగ్ర నివేదిక.!
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!
రాప్తాడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు, విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను విచారణ చేపట్టిన సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, . పిటిషన్‌ను కొట్టివేసింది.
కీలకమైన జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరు అనూహ్యంగా చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడం వైసీపీకి తేరుకోలేని ఎదురుదెబ్బగా పరిణమించింది. కడప జిల్లా మైదుకూరు, అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.
ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించిపోయేలా 94 శాతం స్ట్రైక్ రేట్ దాటాలన్న టార్గెట్ నిర్దేశించారు.