అజాద్ కు ఉపఎన్నికల పర్యవేక్షణ బాధ్యత
Publish Date:Apr 3, 2012
Advertisement
త్వరలో రాష్ట్రంలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఎలాగైనా కొన్ని స్థానాల్లో అయినా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో అయినా గెలవకపోతే పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందని అధిష్టానం ఆందోళన చెందుతుంది. అందుకే ఈసారి ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత అంతా అధిష్టానం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ అజాద్ కు అప్పగించింది. దీంతో అజాద్ త్వరలో హైదరాబాద్ రాబోతున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గానికి ఒక ఎంపి, ఇద్దరూ ఎమ్మెల్యేలు. ముగ్గురు పిసిసి సభ్యులతో కూడిన కమిటీని వేయాలని గులాంనబీ అజాద్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ కమిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే మిగిలిన వారంతా నడుచుకోవాలని అజాద్ ఆదేశించబోతున్నట్లు తెలిసింది. అజాద్ హైదరాబాబ్ వచ్చి స్వయంగా పరిస్థితిని సమీక్షించబోతున్నారు. ఒకవేళ పరిస్థితి ఆశాజనకంగా లేకపోతే ఎన్నికల ప్రచారానికి సోనియా లేదా రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే అవకాశం ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చే ఉప ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/union-health-minister-ghulam-nabi-azad-24-13110.html





