సాధారణ ఎన్నికలంటే ఆసక్తి చూపే తిరుపతి ఓటరు ఉప ఎన్నికలపై అంతగా దృష్టి సాధించదు. అందువల్ల ప్రతీసారి ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పడిపోతూ వస్తోంది. 1983లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించాక జరిగిన సాధారణ ఎన్నికల్లో 70.79శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తరువాత ఆయన రాజీనామా చేయడంతో అదే సవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో 59.54శాతం పోలింగ్ నమోదైంది. అంటే 11.25శాతం ఓటింగ్ తగ్గింది. మళ్లీ ఇప్పుడు ఉప ఎన్నికలొచ్చాయి. 2009లో సాధారణ ఎన్నికలప్పుడు నమోదైన పోలింగ్ శాతం 51.64శాతం. 1983నాటి చేదు అనుభవం ఓటర్ల నుంచి ఎదురైతే ఈ ఉప ఎన్నికలను విశ్లేషించటమే కష్టమని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలూ కూడాప్రతీగడపనూ వదలకుండా ప్రచారం చేస్తున్నాయి. దీని వల్ల ఓటింగ్ శాతం పెద్దగా పెరగకపోయినా కనీసస్థాయి జరుగుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఒక వేల ఓటింగ్ శాతం పడిపోతే మాత్రం మెజార్టీ తగ్గడమే కాకుండా ఫలితాలు కూడా మారే అవకాశముందని పరిశీలనలో తేలుతోంది. దీంతో అభ్యర్థులందరూ ఈ కొత్త విషయంపై దృష్టి సారించి ఓటర్లను ఖచ్చితంగా పోలింగ్ లో పాల్గొనాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులు ఓట్లతో పాటు పోలింగ్ గురించి కూడా విజ్ఞప్తి చేయటం ఓటరును ఆకట్టుకుంటోదని పరిశీలకులు భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirupathi-byelections-24-14600.html
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.