అభ్యర్దులను కూడా గుర్తు పట్టలేకపోతున్న కిరాయి కార్యకర్తలు !

Publish Date:Jun 4, 2012

Advertisement

ప్రస్తుత ఉప ఎన్నికల్లో కిరాయి కార్యకర్తల జోరు పెరిగిపోయింది. డబ్బులు తీసుకుని తమతమ ప్రాంతాల్లో టెంట్లు వేస్తూ అభ్యర్దులు  వచ్చినప్పుడు వారికి ఘనంగా స్వాగతం పలకడం, తమ వార్డుల్లో అభ్యర్దులను తిప్పడం ఈ కిరాయి కార్యకర్తల ప్రధానమైన పని. అయితే ఎవరు డబ్బిస్తే వారి వెంట తిరుగుతున్న ఈ కార్యకర్తలు ఒక్కోసారి తాము ఎవరి తరపున ప్రచారం చేస్తున్నామో కూడా మర్చిపోతున్నారు. ఇటువంటి సంఘటనే తిరుపతిలో జరిగింది.

తిరుపతిలో ఈ కిరాయి కాంగ్రెస్ కార్యకర్తలు తమ అభ్యర్థి ఎం.వెంకరమణ అనుకుని వై.కా.పా. అభ్యర్థి భూమాన కరుణాకరరెడ్డిని పూలతో ముంచెత్తారు. ఆ తరువాత జరిగిన తప్పు తెలుసుకుని నాలిక్కరుచుకుని  భూమానకు జల్లిన పూలను తిరిగి బుట్టలోకి ఏరి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.వెంకటరమణపై జల్లేశారు. హమ్మయ్య! వెంకటరమణ చూడలేదు కాబట్టి సరిపోయిందని కార్యకర్తలు సర్దుకున్నారు. ఈ సంఘటన తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దకాపు లే - అవుట్ సందులో జరిగింది. కానీ, తనకు ఇంత ఆదరణా అని భూమాన కొద్దిసేపు ఆశ్చర్యపోయేలా కాంగ్రెస్ కార్యకర్తలు మిద్దెలపై నుంచి పూలు కురిపించారు. తిరిగి ఆ పూలే వెంకటరమణ పైనా కురిపించారు. ఒకే పూలతో ఇద్దరు అభ్యర్దులను సంతృప్తి పరిచిన ఘనత కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కింది కదూ!

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.