వరదగోదావరితో వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్
Publish Date:Aug 23, 2012
Advertisement
మూడు రోజులుగా ఎగువరాష్ట్రాలయిన చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రాలతో పాటు, ఆదిలాబాద్,వరంగల్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కాళేశ్వరం వద్ద నీటిమట్ట 11.094 మీటర్లు, రామన్నగూడెం వద్ద7.5 దేవాదులవద్ద 82 మీటర్లు, భద్రాచలంలో 33.8 అడుగులకు చేరింది. వరంగల్‌లో కురుస్తున్న చెరువులు, వాగులు,వంకలు విపరీతంగా పారుతుండటంతో పెన్‌గంగ, ప్రాణహిత ఇంద్రావతి, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఆదిలాబాద్ కండెం ప్రాజెక్టునుండి 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాగులు పొంగి పొర్లుతుండటంతో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు నిలచి పోయాయి. లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెన్‌గంగ పొంగటంతో 70 గ్రామాలకు ముప్పు పొంచి వుంది. వాగులు పొంగిపొర్లుతుండటంలో మహారాష్ట్ర , చత్తీస్‌ఘడ్ తోపాటు జిల్లాల్లోని వందలాది గ్రామాలకు రాకపోకలు నిలచి పోయాయి. కరీంనగర్‌జిల్లా మహదేవ్‌పురా మండలంలోని కాళేశ్వరం వద్ద ప్రవాహం 13 మీటర్లు దాటితే మండలంలోని అన్ని గ్రామాలు మునుగుతాయని ప్రజలు భయబ్రాంతలకు గురి అవుతున్నారు. గోదావరి వరద రాకుండా ఉండేందుకు ఏటూరు నాగారం, రామన్నగూడెం చుట్టూ నిర్మించిన కరకట్ట షట్లర్లను రిపేరు చేయక పోవడంతో అక్కడిక్కడే లీకేజీలు అవుతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ఆదివారం 19 అడుగులు ఉండగా సోమవారం సాయంత్రానికి 33.8 అడుగులకు చేరుకుంది. దీంతో రామాలయం స్నానాలఘట్టాలు మునిగాయి. భద్రాచలం డివిజన్ పరిధిలోని చర్లలోని తాలిపేరులో వరదనీరు భారీగా చేరుకోవడంతో ప్రాజెక్టు అధికారులుసోమవారం 3 గేట్లు ఎత్తి5,466 క్యూసెక్కుల నీటిని విడిచి పెట్టారు. వాజేడు మండలంలో చీకుపల్లి కాజ్‌వే నీట మునగటంతో 26 గ్రామాలకు రాకపోకలు నిలచి పోయాయి. దీంతో ప్రజలు నాటు పడవల ద్వారా ప్రయాణిస్తున్నారు. వాజేడులో గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరింది. గోదావరి మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని సీడబ్యుసీ అధికారలు పేర్కొంటున్నారు.
http://www.teluguone.com/news/content/through-and-fro-in-100-villages-disturbed-as-godavari-water-level---increased-24-16784.html





