ఎన్నికల్లో ఓడిపోతే పగబడతారా?

Publish Date:Aug 26, 2012

Advertisement

ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతే అవమానంగా భావించేవారు కొందరు. దీంతో పగబట్టి సాధించాలనుకునేవారు కొందరు. అసలు ఎన్నికలు కాబట్టి గెలుపు, ఓటములు సహజమని సర్దుకుపోయేవారు మరికొందరు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోరకంగా ఉంటుంది. గెలవటమే తమ జీవితం అనుకుని ప్రత్యర్థులతో నేరుగా గొడవపెట్టుకునేందుకు ప్రయత్నిస్తుం టారు. రాష్ట్రం మొత్తం మీద పార్టీల కార్యకర్తలు కూడా ఈ తరహాలోనే పట్టుదలగా వ్యవహరించేవారూ ఉన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ కార్యకర్తలైతే కత్తులతో దాడులకు తెగబడిన రాజకీయ చరిత్ర రికార్డుల్లో నలుగుతోంది. ఎన్నికల్లో ఓడిన పార్టీ ఖచ్చితంగా దాడులకు తెగబడుతుందని గెలిచినపార్టీ ముందస్తుగా పోలీసులను ఆశ్రయించేది. ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక అభ్యర్థులు వ్యక్తిగతంగా పగబట్టడానికి కూడా సిద్దపడుతుంటారు. దీనికి తాజా ఉదాహరణ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తేర చన్నిపురెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ పడ్డారు. ఈ 2009 ఎన్నికల్లో జానారెడ్డి విజయం సాధించి మంత్రి అయ్యారు. దీంతో మంత్రిపై పగబూనిన చిన్నపురెడ్డి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా జానారెడ్డిపై దుష్ప్రచారం చేశారు. రెండునెలలుగా ఆగకుండా ఈ ప్రచారం సాగుతుండటంతో విసిగిపోయిన జానారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు సాక్ష్యులను విచారించి చిన్నపురెడ్డిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. చిన్నపురెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.