ఆ మూడ్‌ నుంచి బయటికి రాలేకపోతున్న కిషన్‌రెడ్డి..!

Publish Date:Jul 29, 2017

Advertisement

 

కిషన్‌రెడ్డి... ప్రస్తుత హోదా బీజేఎల్పీ నేత... అయితే ఏడాది క్రితం వరకూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన...  ఇంకా ఆ మూడ్‌లో నుంచి బయటికి రావడం లేదంట... కొత్త అధ్యక్షుడు వచ్చి ఏడాది దాటిపోతున్నా... ఇంకా పార్టీలో అన్నీ తానే... అంతా తానే అనే ఫీలింగ్ లో ఉంటున్నారట. సుదీర్ఘకాలం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పనిచేసి ఉండటంతో... ఆ మూడ్‌ నుంచి బయటికి రాలేకపోతున్నారట. అందుకే కొత్త అధ్యక్షుడి కింద పనిచేయలేక పార్టీ సమావేశాలను సైతం కూడా లైట్ తీసుకుంటున్నారట. అంతేకాదు.. ఆయన మీటింగ్ పెట్టిన రోజు... మరెవరూ మీటింగ్‌లు పెట్టకూడదంటూ అనధికారికంగా ఆర్డర్స్‌ జారీ చేస్తున్నాడట. దాంతో కిషన్‌రెడ్డి వ్యవహారశైలి పార్టీ నేతలకు, శ్రేణులకు తలనొప్పిగా మారిందంటున్నారు. అంతేకాదు చింత చచ్చినా... పులుపు చావలేదంటే ఇదేనేమో అంటూ గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ బీజేపీకి ఇప్పటికీ తానే అధ్యక్షుడిననే ఫీలింగ్ లో కంటిన్యూ అవుతూ... నేను చెప్పిందే శాసనం... నేను పెట్టిందే మీటింగ్ అంటున్నారని... అంతేకాదు చిన్న చిన్న విషయాలకీ అలగడం కిషన్‌రెడ్డికి అలవాటైపోయిందంటున్నారు.

 

అధ్యక్ష పదవిలో ఉన్నన్నాళ్లూ హల్‌చల్‌ చేసిన కిషన్‌రెడ్డి... పదవీకాలం ముగియగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవడం తగ్గించేశారని... చివరికి ఇటీవల జరిగిన అమిత్‌షా టూర్‌‌లో అంటీముట్టనట్టు వ్యవహరించారని అంటున్నారు. కిషన్‌రెడ్డి వ్యవహారశైలిపై పలువురు అమిత్‌షాకి కంప్లైంట్‌ చేయడంతో... కిషన్‌కి క్లాస్‌ కూడా పీకారట. అయినా కిషన్‌రెడ్డిలో మార్పు రాలేదని, ఇప్పటిలాగానే పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారని చెప్పుకుంటున్నారు. మొన్నటిమొన్న తెలంగాణ అంతటా నిర్వహించిన బీజేపీ విస్తారక్‌ కార్యక్రమానికి కూడా కిషన్‌రెడ్డి దూరంగా ఉన్నారని, అమిత్‌ షా ఆదేశించిన ప్రోగ్రామ్‌ను కూడా పట్టించుకోలేదంటే... అసలు అంత ధైర్యం కిషన్‌రెడ్డికి ఎలా వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు.

 

ఇక పార్టీ రివ్యూ మీటింగ్స్‌కి కూడా కిషన్‌రెడ్డి హాజరుకావడం లేదట. అంతేకాదు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు హాజరైన సమావేశాలకు కూడా డుమ్మా కొడుతున్నారట. మరోవైపు మీడియాకి ముందుగా సమాచారమిచ్చిన ప్రెస్‌మీట్‌‌లను కూడా రద్దు చేసుకుంటున్నారు. ఇలా రద్దు చేసుకోవడానికి... మరొకరు అదేరోజు మీడియా సమావేశం పెట్టడమే కారణమంటున్నారు. కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టిన రోజే... బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు కూడా మీడియా సమావేశం పెట్టడంతో... ఎందుకు పెట్టారంటూ కిషన్‌ రుసరుసలాడారంట. ఒకేరోజు రెండు ప్రెస్‌మీట్‌లు పెడితే పార్టీ ఇమేజ్‌ ఏం కావాలంటూ రఘునందన్‌పై కిషన్‌‌రెడ్డి ఫైరయ్యారట. దాంతో కిషన్‌రెడ్డి వ్యవహార శైలిపై పలువురు నేతలు మండిపడుతున్నారు. పార్టీలో ఏం జరిగినా తనకు చెప్పే జరగాలన్నట్లుగా కిషన్‌రెడ్డి వ్యవరిస్తున్నారని, ఇప్పటికీ తానే అధ్యక్షుడినన్నట్లుగా దర్పం ప్రదర్శిస్తున్నారని, ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

By
en-us Political News

  
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.