రాష్ట్రంలోని అనేక మంది తెలంగాణా కాంగ్రెస్ సిట్టింగ్ ఎం పి లకు 2014 లో తిరిగి పోటీ చేసే అవకాశం లభించదా ? ప్రస్తుతం జరుతున్న పరిణామాలను పరిశీలిస్తే, ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే లభిస్తోంది. పరిస్థితులెలా ఉన్న, తెలంగాణ ఫై నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ హై కమాండ్ కు అంత తేలిక కాదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మనుగడకు అవసరమైన ఎక్కువ మంది ఎంపిలను అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో ఇంత మంది ఎంపి స్థానాలను రాష్ట్రం నుండి తిరిగి పొందలేక పోయినా పరవాలేదు కానీ, తెలంగాణా రాష్ట్రాన్ని మాత్రం ఇచ్చేది లేదని సోనియా గాంధీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రత్యెక తెలంగాణా విషయంలో పట్టుదలతో ఉన్న కేశవ రావు వంటి సీనియర్ నాయకులను పార్టీ అధిష్టానం పక్కన పెట్టడం వంటి విషయాలను పరిశీలిస్తే తెలంగాణ ఫై పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నాయకులు తమ పట్టు సడలించుకోవాలని అధిష్టానం సూచిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.
రాహుల్ గాంధీ దూతలు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున ఎం పి స్థానాలకు పోటీ చేసే అభ్యర్దుల విజయావకాశాలఫై ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. కేవలం సిట్టింగ్ ఎం పి లకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే, ఇంత సర్వే చేయాల్సిన అవసరం లేదని రాహుల్ దూత హైదరాబాద్ లో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పరిణామాలను పరిశీలిస్తే, 2014 లో రాష్ట్రంలో ఎంత మంది సిట్టింగ్ ఎం పి లు తిరిగి టికెట్లు పొందుతారనే దాని ఫై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-congress-43-19490.html
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ హవా.!
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి.
విశాఖ వేదికగా జరగనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్స్ మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా సంచలన విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.
రాప్తాడు బాలిక లక్ష్మి సాహసానికి గుర్తింపు.. చదువుకు అండగా ఆనంద్ మహీంద్రా.!
ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు.
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా 3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు పేర్కొంది. ఇందు కోసం దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నవంబర్ 13, రెండో విడత నోటిఫికేషన్ ను నవంబర్ 18న, ఒక మూడో విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 19వ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది.
4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి సమగ్ర నివేదిక.!
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!