దేశంపై అలకలు, తెలంగాణావాదంలో లుకలుకలు?

Publish Date:Jul 21, 2012

Advertisement

తెలుగుదేశం పార్టీపై అలిగేవారి సంఖ్య పెరుగుతోంది. అలానే తెలంగాణా కోసమే రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం పాల్గొనలేదన్న కొత్తవాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తామన్న తెలుగుదేశం అథినేత చంద్రబాబు ఆ మట్టిలోనే కూరుకుపోయారని ఇతర పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో అసలు పాల్గొనరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితే రాకూడదని ఆ పార్టీ సీనియర్లు అభిప్రాయపడ్డారు. దీంతో తాము రాష్ట్రపతి ఎన్నికలకు హాజరుకాబోమని చంద్రబాబు ప్రకటించారు.

 

ఆయన ప్రకటన వెలువడిన 24గంటల్లోపే రాష్ట్రపతి ఎన్నికలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఐదుగురు ముందుగానే సిద్ధమయ్యారు. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా తమ ఓటుహక్కును కూడా వినియోగించుకున్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నూజివీడు ఎమ్మెల్యే చిన్నంరామకోటయ్య, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, తెలంగాణా ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు. కొడాలినానిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్‌ చేసింది.  నూజివీడు ఎమ్మెల్యే చ్నిం రామకోటయ్యకు మంత్రి పార్థసారధి కాంగ్రెస్‌ కండువాకప్పి ఎన్నికలకు తీసుకువెళ్లారు. ఆయన కూడా ఉత్సాహంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసిపోయారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి కాంగ్రెస్‌ నేత పాలడుగు వెంకట్రావుతో కలిసి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకున్నారు.



ఇది ఇలా ఉంటే టిఆర్‌ఎస్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ ఒక్కసారిగా విలేకరుల ముందు తెలుగుదేశం పార్టీని అభినందనలతో ముంచెత్తారు. ఆయన ఆనందానికి కారణం తెలంగాణా వ్యతిరేకి అయిన కాంగ్రెస్‌ నేత ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఆ ఎన్నికల్లో పాల్గొనటం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించిందని ఆయన అంటున్నారు. అలా తెలంగాణా గురించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొనకపోవటం సంతోషదాయకమని ఆయన కొనియాడారు. వాస్తవానికి ఇప్పటికీ తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ ఒక కొలిక్కి రాలేకపోయింది.



అందుకే తెలంగాణా ఇవ్వాలని కూడా డిమాండు చేయలేదన్న విషయం డాక్టర్‌ చంద్రశేఖర్‌ గమనిస్తే మంచింది. లేకపోతే అసలు తెలంగాణా సిద్దాంతం కోసమే పని చేసే టిఆర్‌ఎస్‌కు ఆయన దూరం కావాల్సి వస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరోలో సగం కన్నా తక్కువ తెలంగాణావాదులుంటే మిగిలిన మొత్తం సమైక్యవాదులన్న విషయాన్ని చంద్రశేఖర్‌ అర్థం చేసుకోవాలి.  ఇలా తనకు తోచినట్లు ప్రకటనలు చేస్తే తరువాత నాలికకరుచుకోవటం మినహా ఏమీ చేయలేరని గుర్తుంచుకోవాలని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.