Publish Date:Apr 18, 2026
హైదరాబాద్ వేదికగా శనివారం (ఏప్రిల్ 18) జరిగిన ఐపీఎల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. దాదాపు ఓటమి అంచుల్లో ఉన్న స్థితి నుండి కోలుకుని ఆరెంజ్ ఆర్మీ అద్భుత విజయం సాధించింది. ఇంత వరకూ సన్ రైజన్ బౌలింగ్ విభాగంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఆఖరి ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైకి విజయాన్ని అందించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (22 బంతుల్లో 59) ఆరంభం నుండే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 5.5 ఓవర్లలోనే ట్రావిస్ హెడ్‌తో కలిసి 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు గట్టి పునాది వేశాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 59) తన క్లాస్ ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జామీ ఓవర్టన్ చెరో మూడు వికెట్లు తీసి హైదరాబాద్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సైతం దీటుగా పోరాడింది. ఆయుష్ మాత్రే 30, మాథ్యూ షార్ట్ 34 పరుగులూ చేశారు. ఇద్దరూ కూడా వేగంగా ఆడటంతో ఒక దశలో చెన్నై విజయం నల్లేరుపై బండినడకే అనిపించింది. అయితే హైదరాబాద్ బౌలర్ ఎషాన్ మలింగ (3/29) కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మలింగ కేవలం 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది.
చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరమైన తరుణంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ బంతిని గత మ్యాచ్ హీరో ప్రఫుల్ హింగేకు అప్పగించాడు. అప్పటికే ఎక్కువ పరుగులు ఇచ్చిన హింగేపై ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌల్ చేశాడు. జామీ ఓవర్టన్ ను ఔట్ చేశాడు.
చివరికి చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకుంది. ఈ విజయంలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల సమష్టి కృషి ఉంది. ఇంత వరకూ హైదరాబాద్ బ్యాటింగ్ లో సూపర్బ్.. కానీ బౌలింగే బలహీనం అన్న ఫీలింగ్ ఉండేది. కానీ గత రెండు మ్యాచ్ ల నుంచి హైదరాబాద్ బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో రైజర్స్ అభిమానుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sunrisers-hyderabad-all-round-show-36-217709.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.