Publish Date:Feb 28, 2012
స్టేషన్ ఘన్ పూర్ లో విచిత్ర పరిస్థితి
హైదరాబాద్: ఒకప్పుడు ప్రత్యర్ధులుగా కుస్తీపత్తులు పట్టుకున్నారు. ఇప్పుడు దోస్తులుగా కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన రాజకీయ చిత్రం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కనిపిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి టిఆర్ఎస్ లో ఉన్న ముగ్గురు ప్రముఖ నాయకులు ఖచ్చితంగా వర్తిస్తుంది. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఉండే విజయరామారావు, టిడిపి అభ్యర్ధిగా కడియం శ్రీహరి, కాంగ్రెస్ అభ్యర్ధిగా డాక్టర్ తాటికొండ రాజయ్య పోటీపడ్డారు. అప్పుడు కడియం శ్రీహరి గెలుపుజెండా ఎగురవేశారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ మద్దతుతో కడియం శ్రీహరి టిడిపి అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా డాక్టర్ తాటికొండ రాజయ్య, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిగా రమేష్ పోటీపడ్డారు. ఇప్పుడు తాజాగా డాక్టర్ రాజయ్య, విజయరామారావు, రమేష్ టిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్న రాజయ్యకు విజయ రామారావు, రమేష్ మద్దతుగా నిలిచారు. క్రితంసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలిచినా రాజయ్యకు మద్దతుగా ఉన్న రాజారపు ప్రతాప్ కాంగ్రెస్ అభ్యర్ధిగా తెరపైకి వచ్చారు.
ఇదిలా ఉండగా టిఆర్ఎస్ లో తాజాగా ఈ ముగ్గురు నాయకుల విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల్లో రాజయ్యకు 68వేల ఓట్లు, శ్రీహరికి 56వేల ఓట్లు, రమేష్ కు 26వేల ఓట్లు పోలయ్యాయి. అలాగే 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయరామారావుకు 31వేల ఓట్లు వచ్చాయి. ఈ విధంగా ఈ ముగ్గురు నాయకులు ఆయా పార్టీల అభ్యర్ధులుగా బరిలో నిలిచినప్పుడు పోలైన ఓట్లశాతం మొత్తంగా కలుపుకుంటే అత్యధికంగా ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురు టిఆర్ఎస్ గెలుపుకోసం పనిచేస్తున్నందున ఆ పార్టీ అభ్యర్ధి రాజయ్య విజయం నల్లేరు పై నడకలాగా ఉంటుందని ఆశిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/stataion-ghana-poor-24-12254.html
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!