Publish Date:Feb 28, 2012
గుంటూరుజిల్లా: రాజకీయాల్లో కొందరి హవా కొంతకాలమే సాగుతుంది. అటువంటి వారిలో గుంటూరుజిల్లా మాజీ ఎంపి వల్లభనేని బాలశౌరి ఒకరు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కాంగ్రెస్ లో కీలకపాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2004 ఎన్నికలకు పూర్వం వ్యాపార రంగంలో ఉన్న బాలశౌరి అనూహ్యంగా రాజకీయ రంగం ప్రవేశం చేసి ఆ ఎన్నికల్లో తెనాలి పార్లమెంటరీ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. అప్పటినుంచి వైఎస్ కు దగ్గరయ్యారు. అప్పుట్లో వైఎస్ ఢిల్లీలో అడుగుపెడితే బాలశౌరి నివాసంలో ఆతిధ్యం తప్పనిసరి. 2009 ఎన్నికల నాటికి వారిద్దరి మధ్య అనుబంధం మరింత బలపడింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో తెనాలి పార్లమెంటరీ నియోజకవర్గం రద్దు కావడంతో అక్కడినుంచి పోటీ చేసే అవకాశం బాలశౌరి కోల్పోయారు. అయితే వైఎస్ ఆర్ తన స్నేహితుడికి తిరిగి పోటీచేసే అవకాశం కల్పించేందుకు పెద్ద ఎత్తున పావులు కదిపారు. ఒక దశలో ఎంపి రాయపాటిని తప్పించి గుంటూరు నుంచి బాలశౌరిని పోటీచేయించాలని ప్రయత్నించారు. అయితే సోనియాగాంధీ జోక్యంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. చివరకు నర్సరావుపేట సిట్టింగ్ ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డిని నెల్లూరుకు పంపి అక్కడినుంచి పోటీచేసే అవకాశం బాలశౌరికి కల్పించారు. అయితే కేవలం 1600 ఓట్ల తేడాతో బాలశౌరి ఓటమి చెందారు. అంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జి పదవి బాలశౌరిని కట్టబెట్టే ప్రయత్నంలో ఉండగా వైఎస్ ఆర్ హఠాన్మరణం చెందారు. అప్పటినుంచి బాలశౌరి హవాకు కాంగ్రెస్ లో గండిపడింది. జగన్ తో కూడా బాలశౌరికి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ కు దూరంగానే ఉంటున్నారు. అయితే ఆయన ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తటస్థ వైఖరి అవలంభిస్తున్న బాలశౌరి పయనం ఎటనేది తేలాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vallabaneni-balasouri-24-12255.html
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!