Publish Date:Feb 28, 2012
న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక బంద్ పిలుపుకు దేశవ్యాప్తంగా పాక్షిక స్పందన కనిపించింది. కొన్ని చోట్ల బ్యాంకింగ్ వ్యవస్థలు, రవాణా రంగం ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో బస్సులు తక్కువగానే రోడ్డెక్కాయి. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మాత్రం చాలావరకు తెరుచుకున్నాయి. బంద్ పాటిస్తే సర్వీస్ బ్రేక్ గా ట్రీట్ చేస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించిన విషయం తెలిసిందే. కోల్ కతాలో పరిస్థితి అంతా అదుపులోనే ఉందని డిజిపి చెప్పారు. కొన్ని అరెస్టులు మినహా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనలేదని చెప్పారు.
బంద్ ప్రభావం కేరళలో కనిపించింది. అక్కడ బస్సులు రోడ్డెక్కలేదు. కాగా కేరళలో అధికారంలో ఉన్న యుడిఎఫ్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో నో వర్క్ నో పే ఆర్డర్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో అధికారులు సమ్మెలో పాల్గొనకుండా ఒప్పించారు. కాగా ఆంధ్ర ప్రదేశ్‌లోను బంద్ ప్రభావం పాక్షికంగానే కనిపించింది. హైదరాబాదులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాఘవులు తదితరులు అరెస్టయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమ్మెతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని హెచ్చరించాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prize-raised-24-12252.html
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!