రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. నడవలేని స్థితిలో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ

Publish Date:Apr 26, 2026

Advertisement

15 ఏళ్లకే పరుగుల మోత మోగిస్తూ, రికార్డుల దుమ్ము దులుపుతున్న వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీకి గాయమైంది. దాంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు కీలక తరుణంలో పెద్ద షాక్  త‌గిలింది. శ‌నివారం (ఏప్రిల్ 25)  జైపూర్ వేదిక‌గా సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ గాయ‌ప‌డ్డాడు. స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా బంతిని ఆపే క్ర‌మంలో 15 ఏళ్ల వైభ‌వ్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 15 ఏళ్ల వయసులో రికార్డుల మోత మోగిస్తూ.. క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడటం జట్టుతో పాటు అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది.

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ మరో సెంచరీ నమోదు చేసాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. కానీ ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తూ వైభవ్ సూర్యవంశీ గాయ పడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడు. సహాయక సిబ్బంది సహకారంతో మైదానం నుంచి బయటకు వెళ్లాడు. వైభవ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్ పిచ్ బంతిని ఇషాన్ కిషన్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని అడ్డుకోవడానికి సర్కిల్ లోపల ఉన్న వైభవ్ సూర్యవంశీ వెనక్కి పరిగెత్తాడు. అయితే బంతిని వెంబడిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అతనికి హామ్‌స్ట్రింగ్ పట్టేసింది. వెంటనే నడవలేక మైదానంలోనే కూలబడిపోయాడు. 

వైభవ్ ఇబ్బంది పడటం చూసి వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ నొప్పి తీవ్రంగా ఉండటంతో అతను లేచి నడవలేకపోయాడు. కనీసం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడటంతో, సపోర్ట్ స్టాఫ్ అతనిని భుజాల మీద మోసుకుంటూ మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే వైభవ్ సేవలు చాలా అవసరం. ఈ హామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రమైంది అయితే.. వైభవ్ కనీసం 2-3 వారాల పాటు ఆటకు దూరం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. తొడ కండరాల గాయంతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరం అవుతాడేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. విశ్రాంతి తీసుకోవటం ద్వారా వైభవ్ త్వరగా కోలుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

By
en-us Political News

  
భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ అనే వాక్యానికి అక్షర రూపం ఇచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు.
ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు.
తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా స్పందించారు.
హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఇంధన సంక్షోభం మొదలైంది.
గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఒక కొత్త రికార్డు.
ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు.
చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం.
మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటి.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం, అగ్నిమాపక దళం సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు.
కేవలం భౌతిక సరిహద్దులే కాకుండా.. సమాచారం, సాంకేతికత, సామాజిక సంబంధాల చుట్టూ కూడా నాలుగు అంచల నియంత్రణ వ్యవస్థను బీజింగ్ సిద్ధం చేస్తోంది.
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందనీఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దనీ అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. పెరిగిన తేమ కారణంగా ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుందనీ వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.