దేశ రాజధాని హస్తినలో ఎంపీ పప్పుయాదవ్ పై దాడి యత్నం జరిగింది. బిహార్‌లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై హస్తినలో ఆయన అధికారిక నివాసంలోనే దాడి జరగడం కలకలం రేపింది. వ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం (ఆగస్టు 2) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పప్పూయాదవ్ పై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు.
అదే సమయంలో మరో వ్యక్తి.. కత్తితో దాడికి ప్రయత్నించాడు. పప్పు యాదవ్ సిబ్బంది, మద్దతుదారులు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడితో ప్రెస్‌మీట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ మద్దతుదారులు చెప్పు విసిరిన వ్యక్తిపై భౌతిక దాడికి ప్రయత్నించారు.
అయితే.. ఎంపీ పప్పు యాదవ్ ఆ దాడి జరగకుండా నివారించారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాధు సంత్ ల పట్ల పప్పు యాదవ్ అనుచితంగా మాట్లాడారనే ఆగ్రహంతోనే తాను ఈ చర్యకు పాల్పడినట్లు నిందితుడు తెలిపినట్లు సమాచారం. కాగా ఈ దాడి ఘటనపై పప్పుయాదవ్ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో తీవ్రమైన అవకతవకలు, అక్రమాలు జరిగాయని తాను బహిరంగంగా ఆరోపించినప్పటి నుంచీ, తనకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయన్నారు.
కొందరైతే తన 51 లక్షల రివార్డు ప్రకటించారని తెలిపారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిజాలను నిర్భయంగా మాట్లాడే ప్రజాప్రతినిధులపై ఇలాంటి దాడు దాడులు దారుణమని పప్పుయాదవ్ అన్నారు.
Pappu Yadav shoe thrown, Purnia MP attack Delhi, Ram Mandir donation controversy, Pappu Yadav knife attack attempt, Telugu One
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/attack-on-pappu-yadev-36-227828.html
ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నూజివీడు పోలీసులు, గుజరాత్ వెళ్లి మరీ అరెస్టు చేశారు.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో నడుస్తున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఒక వీడియో దాదాపు ఐదు గంటల పాటు అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ కమిటీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి కారణాలను పది రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని మెటా యాజమాన్యాన్ని కమిటీ ఆదేశించింది.
ఆయన తీసుకున్న టారిఫ్ ల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ టెర్రర్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పాతిక రాష్ట్రాలలో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది.
యాపిల్ ప్లాట్‌ఫామ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించేలా సున్నితమైన కంటెంట్ టెలిగ్రామ్‌లో కనిపించడమే టెలిగ్రామ్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించడానికి కారణమని తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానెళ్లలో వ్యాప్తి చెందినట్లు యాపిల్ బృందం గుర్తించింది.
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
GMKtec NEO X1 వర్క్‌స్టేషన్ పిసి అత్యంత వేగవంతమైన AMD Ryzen 9000HX సిరీస్ ల్యాప్‌టాప్ CPU మరియు NVIDIA RTX 5070 డెస్క్‌టాప్ GPU కాంబినేషన్‌తో లాంచ్ అయింది. 14.6L చిన్న పరిమాణంలో లిక్విడ్ కూలింగ్‌తో వచ్చిన ఈ పవర్‌ఫుల్ పిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హెచ్‌బీవో మాక్స్ ఫేమస్ సిరీస్ స్టూవర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 3 రిలీజ్ డేట్, ఇండియా స్ట్రీమింగ్ టైమింగ్స్ మరియు మొత్తం 10 ఎపిసోడ్‌ల కంప్లీట్ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1.14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తికి రూ. 10 రీఫండ్ వచ్చింది. సీఏ సుమిత్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఐటీ నిబంధనలు మరియు సెక్షన్ 143 1 అసలు నిజాలను వెల్లడించాయి.
ప్రసిద్ధ కన్జ్యూమర్‌వేర్ బ్రాండ్ సెల్లో వరల్డ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్ చర్చలు జరుపుతోంది. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈ డీల్ మరియు భారత మార్కెట్ సమీకరణాల వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వేళలు మారాయి! NSE మరియు BSE కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS టైమింగ్స్, F&O ట్రేడింగ్ మార్పులు మరియు ఇన్వెస్టర్లపై దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.