Publish Date:May 11, 2012
కాంగ్రెసులోని అగ్రకులాల వారు దళితులను పార్టీలో ఎదగకుండా అణగదొక్కుతున్నారని శంకరరావు మండిపడ్డారు.సిఎల్పీలోకి వెళ్లే తన హక్కును కాలరాచినందుకు ముఖ్యమంత్రి పైన, సిఎల్పీ సిబ్బంది పైన తాను స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. తనలాంటి దళితుడిని అడ్డుకున్నందుకు సిఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నట్లు చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేను అని, తనకు సిఎల్పీ కార్యాలయానికి వచ్చే హక్కు ఉందన్నారు.
ముఖ్యమంత్రిపై పోలీసులు 24 గంటలలోగా కేసు నమోదు చేయకుంటే తాను మహాత్మా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన చేపడతానని హెచ్చరించారు. కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. కాగా శంకర రావు తన వ్యక్తిగత సిబ్బందితో ముఖ్యమంత్రిపై, సిఎల్పీ కార్యవర్గంపై అట్రాసిటీ కేసు పెడుతున్న లేఖను సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు పంపించారు. పిఏ ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలను పోలీస్ స్టేషన్‌లో ఇచ్చారు. ఆ తర్వాత ఆయన స్పీకర్‌ను కలిసి సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశముంది. కిరణ్ కో హఠావో కాంగ్రెసుకో బచావో అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shankar-rao-24-13959.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.