Publish Date:May 11, 2012
సాక్షి ఖాతాల స్తంభనన పత్రిక స్వేచ్ఛతో ముడిపెట్టవద్దని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు గురువారం న్యూఢిల్లీలో అన్నారు. సూర్య పత్రిక యజమాని నూకారపు సూర్యప్రకాశ్ రావును జైల్లో పెట్టినప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల సంక్షేమం గురించి ఈ పాత్రికేయ సంఘాలకు, రాజకీయ పార్టీలకు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. జీతాలు రాని పరిస్థితి వస్తే ఉద్యోగులు యాజమాన్యాన్ని నిలదీయాలి తప్పితే రోడ్ల మీదకొచ్చి రాజకీయ నినాదాలు చేయడం ఏమిటన్నారు. జగన్‌కు ఏమీ కాకుండానే రోడ్ల మీదకొచ్చి రంకెలేస్తున్నారన్నారు. నూకారపును అరెస్ట్ చేసినప్పుడు సూర్య ఉద్యోగుల సంక్షేమం గురించి ప్రశ్నించారా అన్నారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతిలను చదవవద్దని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చినప్పుడు పాత్రికేయ సంఘాలు ఎందుకు స్పందించలేదన్నారు. ఖాతాలు స్తంభింప చేస్తేనే పత్రిక స్వేచ్ఛను హరించి వేసినట్లా అని ప్రశ్నించారు. మార్గదర్శిని మూసేయించి ఈనాడును దెబ్బకొట్టాలని వైయస్ ప్రయత్నించినప్పుడు నాయకులెవ్వరూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు సాక్షి అవినీతిని వ్యతిరేకించినా... సాక్షి ఉద్యోగుల ఆందోళనకు కవరేజి ఇచ్చాయన్నారు. మార్గదర్శిపై ఉండవల్లి కేసు వేసినా ఆయన ప్రకటనలనూ ఈనాడు ప్రచురించిందన్నారు. కానీ సాక్షి మాత్రం ఎదుటివారిపై బురదజల్లడాన్ని పనిగా పెట్టుకుందన్నారు. వైయస్ పాదయాత్రకు ఈనాడు ఇచ్చినంత కవరేజ్ ఏ పత్రికా ఇవ్వలేదన్నారు. అలాంటి పత్రిక పైనే తర్వాత ఆయన కక్ష కట్టారన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అవినీతిపైన దాడే తప్ప పత్రికా స్వేచ్ఛ పైన కాదన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-eenadu-ys-rajashekar-reddy-24-13954.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.