ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్‌కు ఈడీ నోటీసులు?

Publish Date:Jun 5, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  పెను సంచలనం. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఉచ్చు బిగుస్తున్నది.   రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో  ఈడీ జగన్ ను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డికి ఈడీ త్వరలోనే నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. గతంలో అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొన్న జగన్.. దాదాపు దశాబ్దం తరువాత మద్యం కేసులో మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్నారు.  

 దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వ  స్థాయిలో జరిగిన అత్యంత పెద్ద ఆర్థిక మోసాలలో ఒకటిగా, ఏపీ మద్యం కుంభకోణాన్ని చెబుతారు. ఈ కేసులో భారీ మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్  సీఎంగా ఉన్న కాలంలోనే  ఈ మొత్తం వ్యవహారం నడిచినట్లు ఆరోపణలున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ లిక్కర్ స్కామ్ విలువ  3,200 కోట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.  ఇంతటి భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టడం, ప్రభుత్వ ఖజానాకు గండి పడటాన్ని  కేంద్ర దర్యాప్తు సంస్థ  తీవ్రంగా పరిగణిస్తోంది. నాణ్యత లేని మద్యం సరఫరా చేయడంతో పాటు, కేవలం నగదు రూపంలోనే (క్యాష్ ఓన్లీ) లావాదేవీలు సాగించడం ఈ కుంభకోణంలో ప్రధానమైన అంశం. డిజిటల్ పేమెంట్లను అనుమతించకపోవడం వెనుక వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. 

ఏపీ మద్యం కుంభకోణం విచారణలో భాగంగా ఈడీ ఇప్పటికే  జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన కీలక నేతలను విచారించింది.  వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఈడీ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.  ఈ విచారణల ద్వారా జగన్  హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించి కీలకమైన, తిరుగులేని ఆధారాలను ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో లభించిన డాక్యుమెంట్లు, డిజిటల్ సాక్ష్యాల ఆధారంగానే ఈడీ జగన్ ను విచారించాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.   

రాజకీయ, అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ఏపీ మద్యం కుంభకోణం  అవినీతి సొమ్ములో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను అక్రమమార్గాల ద్వారా  దుబాయ్‌కు  తరలించారు. అందుకు సంబంధించిన ఆధారాలతోనే ఈడీ జగన్ ను విచారణకు పిలవనుందని అంటున్నారు.    

By
en-us Political News

  
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.