డ్రోన్ దాడులను సైతం లెక్క చేయకుండా సాగిన లోకేష్ రష్యా పర్యటన

Publish Date:Jun 7, 2026

Advertisement

రష్యా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్థిక సదస్సు   ప్రారంభానికి ముందే అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించారు. ఈ ఆకస్మిక పరిణామాలతో సదస్సుకు హాజరవుతున్న వివిధ దేశాల ప్రతినిధులలో తీవ్ర ఆందోళన, అనిశ్చితి వ్యక్తమయ్యాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని  సాహసోపేత  నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  పెట్టుబడుల  ఆకర్షణే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించిన ఏపీ ప్రతినిధి బృందం, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగాలని నిర్ణయించింది. అనుకున్నట్లుగానే మంత్రి లోకేష్ ఆర్థిక సదస్సులో పాల్గొని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన వ్యాపార అవకాశాలను అంతర్జాతీయ వేదికపై సమర్థవంతంగా ప్రదర్శించారు.

అసాధారణమైన భద్రతా వలయం మధ్య జరిగిన ఈ సదస్సులో మంత్రి లోకేష్ పలువురు ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణాన్ని   వివరించారు. డ్రోన్ దాడుల వార్తలు అంతర్జాతీయంగా హెడ్‌లైన్స్‌లో నిలిచినప్పటికీ, లోకేష్ పర్యటనను కొనసాగించడం ఇప్పుడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక రంగాల విస్తరణపై ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ నిర్ణయం అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా అంతర్జాతీయ పెట్టుబడిదారుల ముంగిటకు వెళ్లి అవకాశాలను రాబట్టాలనే పట్టుదలను లోకేష్ ప్రదర్శిం చారంటున్నారు.  ఈ పర్యటన ద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా విదేశీ పెట్టు బడులు తరలివచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలుచెబుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలలో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడేందుకు ఈ రష్యా పర్యటన ఎంతగానో దోహదపడుతుందని పారిశ్రామిక రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు.

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.