బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి
Publish Date:Jun 7, 2026
Advertisement
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది. బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ దొంగతనం వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్టు పోలీసులకు అనుమానం కలుగుతోంది. నిన్న రాత్రి వేళ, ఇంట్లో ఎవరి లేకపోయిన సమయాన్ని సరిగ్గా ఎంచుకున్న దొంగలు, చాలా జాగ్రత్తగా ఇంట్లోకి ప్రవేశించారు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వారు నేరుగా విలువైన వస్తువులు ఉన్న చోటుకే వెళ్లినట్టు సమాచారం. ముఖ్యంగా సేఫ్‌లో భద్రపరిచిన సుమారు కోటిన్నర రూపాయల నగదును తీసుకొని, వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయినట్టు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం ఇంటి సభ్యులు వచ్చి చూసినప్పుడు ఇంటి తాళం పగులగొ ట్టనట్టు ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సనత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని ప్రతి మూలను పరిశీలిస్తూ క్లూస్ సేకరించారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు కీలకంగా తీసుకుని దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది సాధారణ దొంగతనం కాదని, ఇంటి లోపలి సమాచారం తెలిసిన వ్యక్తుల సహకారం ఉండొచ్చన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోటిన్నర రూపాయల భారీ చోరీ కావడంతో ఈ ఘటన నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
http://www.teluguone.com/news/content/massive-theft-at-brs-leader-suresh-reddys-house-mpsuresh-reddy-36-222147.html





