నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ కవచ్’.. 2,149 వాహనాల స్వాధీనం

Publish Date:Jun 5, 2026

Advertisement

 

హైదరాబాదు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం రాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగిన ఈ డ్రైవ్‌లో ప్రధానం గా వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, నకిలీ నంబర్ ప్లేట్లు, నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే నిబంధన లను ఉల్లంఘించిన 2,149 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కీలక ప్రాంతాలను ఎంపిక చేసి లా అండ్ ఆర్డర్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్, మధురానగర్, బోరబండ, సనత్‌నగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సందర్శించారు. తనిఖీల తీరును పరిశీలించిన ఆయన, కొన్ని వాహనాలను స్వయంగా ఆపి నంబర్ ప్లేట్లను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఉన్న వాహనదారులతో మాట్లాడి, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆపరేషన్‌లో భాగంగా నగరవ్యాప్తంగా మొత్తం 12,098 వాహనాలను తనిఖీ చేశారు. 

వీటిలో 8,802 ద్విచక్ర వాహనాలు, 1,693 నాలుగు చక్రాల వాహనాలు, 1,623 ఆటోలు ఉన్నాయి. తనిఖీల్లో 1,406 వాహనాల్లో నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, 1,132 వాహనాల్లో నంబర్ ప్లేట్ లేకపోవడం, 69 వాహనాల్లో నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మొత్తం 2,149 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌ను సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘ నగా పరిగణించబోమని స్పష్టం చేశారు. నేరస్థులు పోలీసుల నుంచి తప్పించు కోవడానికి నంబర్ ప్లేట్లను మార్చడం, అస్పష్టంగా ఉంచడం లేదా నకిలీ నంబర్లను వినియోగించడం వల్ల ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందన్నారు.

ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై చీటింగ్, ఫోర్జరీ తదితర కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.వాహన దారులు నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాహనానికి సంబం ధించిన అన్ని ధ్రువపత్రా లను వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ, రాబోయే రోజుల్లో అన్ని రకాల వాహనాలపై ఈ ప్రత్యేక తనిఖీలు కొనసా గుతాయని తెలిపారు. నగర శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని సీపీ సజ్జనార్ వెల్లడించారు.

By
en-us Political News

  
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.