సికిందరాబాద్ మద్రాస్ రెజిమెంట్ లో భారీగా ఆయుధాలు చోరీ.!

Publish Date:Sep 1, 2026

Advertisement

దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సైనిక స్థావరాల్లో ఒకటైన సికింద్రా బాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ లో భారీగా ఆయుధాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది.  సికింద్రాబాద్‌లోని  కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో  ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  

మిలిటరీ డిపో  స్టోర్ రూమ్ లాక్ పగులగొట్టి దాదాపు 12 అత్యాధునిక ఆయుధాలతో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని అపహరించినట్లు తెలుస్తోంది.  సైనిక నిఘా, భద్రతా వ్యవస్థలు ఉన్న ప్రదేశంలోనే ఈ తరహా  చోరీ జరగడం రక్షణ రంగ వర్గాలలో  ఆందోళన వ్యక్తమౌతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం..   మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల గది తాళం పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు ఏకే47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ సహా   తుపాకులను చోరీ చేశారు. ఆయుధాలతో పాటు వీటికి సంబంధించిన మందుగుండు సామగ్రిని కూడా ఎత్తుకెళ్లారు. ఈ ఉదంతం ఆదివారం (ఆగస్టు 30) రాత్రి సమయంలో జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించిన సైనిక అధికారులు..   బొల్లారం పోలీసు స్టేషన్లో  ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదు మేరకు  బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు ప్రారంభించారు. 

ఆయుధాల చోరీ వ్యవహారం   దేశ రక్షణ,  భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో దర్యాప్తు వివరాలను అధికారులు  గోప్యంగా ఉంచుతున్నారు. కంటోన్మెంట్ పరిధిలోకి సాధారణ పౌరుల ప్రవేశంపై కఠిన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో.. ఈ భారీ  వెనుక స్థానిక సైనిక సిబ్బంది లేదా లోపలి పరిచయాలు ఉన్న వ్యక్తుల హస్తం ఉండి ఉండవచ్చనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   ఆయుధాలు, మందుగుండు సామగ్రి  ని ఎత్తుకెళ్లిన ఘటనలో ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.   కేసు విచారణలో భాగంగా మద్రాస్ రెజిమెంట్ ఆవరణలోని పరిసర ప్రాంతాలు, ఎంట్రీ, ఎగ్జిట్  ద్వారాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు  జల్లెడ పడుతున్నారు.

ఇటీవల కాలంలో ఆయుధాల గది వైపు వెళ్లిన వ్యక్తులు, విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది జాబితాను సేకరించి వారిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మరోవైపు సైనిక విభాగం కూడా  అంతర్గత విచారణను వేగవంతం చేసింది.సైనిక దళాలకు చెందిన వ్యూహాత్మక ఆయుధాలు సాధారణ సమాజంలోకి లేదా అవాంఛనీయ శక్తుల చేతుల్లోకి వెళ్తే  పెను ప్రమాదమని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన మార్గాలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలను విస్తృతం  చేశారు. ఈ భద్రతా లోపానికి బాధ్యులైన వారిని  గుర్తించి చోరీకి గురైన ఆయుధాలను రికవరీ చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 


[Secunderabad Madras Regiment Arms Theft, Hyderabad Cantonment News, Weapons Stolen,  Bollarum Police, Army Security Breach Secunderabad, Telugu One]

By
en-us Political News

  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?
తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..!
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిన్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
హైదరాబాద్‌ నగరంలోని ఫిలింనగర్‌ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
నీట్ పీజీ లో మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో  ఉంటూ ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు నిరంతరం శ్రమించేది. అయితే..  రోజువారీ టెస్ట్ సిరీస్‌లలో వస్తున్న మార్కులతో నిరాశ చెందింది.
న్న దుకాణంలో వచ్చే పరిమిత సంపాదనతో సంతృప్తి చెందకుండా.. అడ్డదారి తొక్కాడు.    గంజాయి చాక్లెట్ల విక్రయాల వైపు అడుగులు వేశాడు.
స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్ రెడ్డి లట్టుపల్లి చొరవ, సహకారంతో   ఆయన అమెరికా   ఫిలడెల్ఫియాలో ఉన్న మోంగ్ కుల్ తెప్ మునీ  బౌద్ధ విహార, ఫొషో బౌద్ధలయం సందర్శించారు.
నాలుగు దశాబ్దాలుగా పరారీలో ఉన్న వీరన్నకు సహకరించిన వ్యక్తులు ఎవరు, చట్టం కళ్లుగప్పి.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉద్యోగం ఎలా సంపాదించగలిగాడు అన్న విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు. దశాబ్దాల పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో  ఎలా కొలువుదీరాడనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.  
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.