వినాయక చవితికి ముందే రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ? ఎవరు ఇన్ ఎవరు ఔట్ అంటే?

Publish Date:Aug 31, 2026

Advertisement

తెలంగాణ చాలా కాలంగా నలుగుతున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. గణేష్ చతుర్థికి ముందే రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని  అంటున్నారు.  ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టమైన సమాచారం అందిందనీ, మంత్రివర్గంలో మార్పులూ చేర్పులూ చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను హస్తినకు  వెళ్లనున్నారనీ తెలుస్తోంది.  

కాగా తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.  విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉంది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం.  వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే కొందరు మంత్రుల పోర్టుపోయలియోలు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే వారిలో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి పేరు ప్రముఖగా వినిపిస్తోంది. కాగా రేసులో జీహఎచ్ఎంసీ మాజీ మేయర్ విజయలక్ష్మి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది.  ఇంకా రేసులో  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకుంటే.. టీపీసీసీ చీఫ్ గా బీసీ నాయకుడికి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు.  ఇంకా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే..   దళిత వర్గానికి చెందిన నేతకు  స్పీకర్ బాధ్యతలు కట్టబెడతారంటున్నారు. 

జీహెచ్ఎంసీ,   స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర పరిధిలోని కీలక నేతను కేబినెట్ లోని తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా గట్టిగా ఉందంటున్నారు. మొత్తం మీద  సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత దెబ్బతినకుండా సీఎం రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటున్నారు.   

[Telangana Cabinet Reshuffle , Before Vinayakachavithi,  CM Revanth Reddy, Konda Surekha Issue, Vijayashanti, TPCC Chief Mahesh Kumar Goud, Assembly Speaker, Prasad Kumar]

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?
తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..!
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిన్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
హైదరాబాద్‌ నగరంలోని ఫిలింనగర్‌ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
నీట్ పీజీ లో మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో  ఉంటూ ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు నిరంతరం శ్రమించేది. అయితే..  రోజువారీ టెస్ట్ సిరీస్‌లలో వస్తున్న మార్కులతో నిరాశ చెందింది.
న్న దుకాణంలో వచ్చే పరిమిత సంపాదనతో సంతృప్తి చెందకుండా.. అడ్డదారి తొక్కాడు.    గంజాయి చాక్లెట్ల విక్రయాల వైపు అడుగులు వేశాడు.
స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్ రెడ్డి లట్టుపల్లి చొరవ, సహకారంతో   ఆయన అమెరికా   ఫిలడెల్ఫియాలో ఉన్న మోంగ్ కుల్ తెప్ మునీ  బౌద్ధ విహార, ఫొషో బౌద్ధలయం సందర్శించారు.
నాలుగు దశాబ్దాలుగా పరారీలో ఉన్న వీరన్నకు సహకరించిన వ్యక్తులు ఎవరు, చట్టం కళ్లుగప్పి.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉద్యోగం ఎలా సంపాదించగలిగాడు అన్న విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు. దశాబ్దాల పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో  ఎలా కొలువుదీరాడనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.  
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి, చెల్లింపులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.