హిట్‌ అండ్‌ రన్‌లో ఒకరి మృతి.. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ కుమారుడు అరెస్ట్‌..?

Publish Date:Sep 1, 2026

Advertisement

 

హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఓఆర్‌ఆర్‌ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నందులాల్‌ అనే వ్యక్తిని ఓ ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో నందులాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న విద్యార్థి జైద్‌షా కద్రీ ప్రమాదాన్ని గమనించి మానవతా దృక్పథంతో స్పందించాడు. గాయపడిన నందులాల్‌ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు.

అయితే నందులాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మరో కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందులాల్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. జైద్‌షా కద్రీ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జైద్‌షా కద్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రమాదం అనంతరం మహీంద్రా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వాహనాన్ని గుర్తించి వెంబడించి పట్టుకున్నారు. కారు నడిపిన సందీప్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనం వేగం, ప్రమాదం జరిగిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఒకరి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన విద్యార్థి.. చివరకు అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. నందులాల్‌ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొనగా.. జైద్‌షా కద్రీ త్వరగా కోలుకోవాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.


Hyderabad, Rayadurgam, Hit and Run, Road Accident, Road Accident Death, Nandulal, Zaid Shah Qadri, Sandeep Anand Sai, Anand Sai Son Arrested, Mahindra Car, Innova Car, Khajaguda, ORR Rotary, Rayadurgam Police, Hit and Run Case, Art Director Anand Sai

By
en-us Political News

  
హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
సికింద్రాబాద్‌లోని  కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో  ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?
తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..!
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిన్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
హైదరాబాద్‌ నగరంలోని ఫిలింనగర్‌ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
నీట్ పీజీ లో మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో  ఉంటూ ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు నిరంతరం శ్రమించేది. అయితే..  రోజువారీ టెస్ట్ సిరీస్‌లలో వస్తున్న మార్కులతో నిరాశ చెందింది.
న్న దుకాణంలో వచ్చే పరిమిత సంపాదనతో సంతృప్తి చెందకుండా.. అడ్డదారి తొక్కాడు.    గంజాయి చాక్లెట్ల విక్రయాల వైపు అడుగులు వేశాడు.
స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్ రెడ్డి లట్టుపల్లి చొరవ, సహకారంతో   ఆయన అమెరికా   ఫిలడెల్ఫియాలో ఉన్న మోంగ్ కుల్ తెప్ మునీ  బౌద్ధ విహార, ఫొషో బౌద్ధలయం సందర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.