బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలి: కల్వకుంట్ల కవిత డిమాండ్.. కారణమేంటో తెలుసా.?

Publish Date:Sep 30, 2026

Advertisement

బీఆర్ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత బయటకు రాక తప్పని పరిస్థితులు ఏర్పడడానికి ఆమె  పార్టీలో కొనసాగుతున్న సమయంలో మాజీ మంత్రి  హరీశ్‌రావు, సంతోష్‌పై   తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ఒక ప్రధాన కారణం. హరీష్ లక్ష్యంగా అప్పట్లో ఆమె చేసిన విమర్శలు, ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీంతో పార్టీ ఆమె క్రమశిక్షణ గీత దాటారని పేర్కొంటూ చర్య తీసుకుంది, 

ఇప్పుడు ఆమె నాడు తనపై చర్య తీసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఎందుకు సస్పెండ్ చేయరంటూ నిలదీస్తున్నారు. సొంత సోదరుడు లక్ష్యంగా ఇప్పుడామె విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. నాడు హరీష్ రావుపై విమర్శలు చేశానంటూ తనపై క్రమశిక్షణ చర్య తీసుకున్న పార్టీ ఇప్పుడు అంత కంటే పెద్దతప్పు చేసిన కేటీఆర్ ను ఎలా, ఎందుకు ఉపేక్షిస్తోందంటూ నిలదీస్తున్నారు. 

  ఇటీవల ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.

అలా ఎమ్మెల్యేలకే నియోజకవర్గాలపై సంపూర్ణ అధికారాలను కట్టబెట్టడం వల్ల కింది స్థాయి నాయకత్వం, క్యాడర్ కేసీఆర్ కు దూరమైందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తప్పు చేశారంటూ కేటీఆఱ్ చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.  కేటీఆర్ పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు.  ఆయనపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు హరీష్ రావుపై విమర్శలు చేసిన వెంటనే  పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేసిన కవిత.. మరి ఇప్పుడు కేటీఆర్ ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ పైనే విమర్శలు చేసినా ఎందుకు ఉపేక్షిస్తున్నారని నిలదీశారు.  


[Kavitha, KTR, BRS, KCR, Harish Rao, Suspend KTR, Kavitha Demand, Telugu One]

By
en-us Political News

  
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కారు వదిలేసి ద్విచ్రవాహనంపై మునుగోడు వీధుల్లో  ఆయన పర్యటించారు.
ఆర్థిక నేర ఆరోపణలు, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు విచారణను ఎదుర్కొనేందుకు అందుబాటులో లేకుండా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ..  వారి పాస్‌పోర్ట్‌లను నిలిపివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన లోకల్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రేటర్   పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన  పలువురు  ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.  దానం నాగేందర్, వివేకానంద వంటి నేతల ఫిరాయింపులు పార్టీ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపాయి.
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..!
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.