JNTUలో ర్యాగింగ్ రచ్చ: గొంతు పిసికిన సీనియర్లు.!
Publish Date:Sep 29, 2026
Advertisement
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని JNTU కాలేజీలో EEE సెకండ్ ఇయర్ విద్యార్థి రుత్విక్‌పై నాలుగో సంవత్సరం చదువుతున్న ఇద్దరు సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతటితో ఆగకుండా క్యాంపస్‌లోనే రుత్విక్‌పై దాడి చేసి గొంతు పిసికినట్లు సమాచారం.ఈ ఘటనపై బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకోలేదని తోటి విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థులు రోడ్డెక్కారు. NH-161పై బైఠాయించి నిరసన చేపట్టారు.బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో కలిసి ధర్నాలో పాల్గొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల ఆందోళనతో స్పందించిన కాలేజీ యాజమాన్యం.. ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అనంతరం ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ర్యాగింగ్‌కు తావులేదని, విద్యార్థుల భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది. [ Ragging in JNTU, Sangareddy District, Sultanpur JNTU, Ruthvik, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/ragging-in-jntu-24-232919.html




